ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే కల్కి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఇంటి వద్ద భారీ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినా ఈ చిత్రం ఎప్పుడోస్తుందా అని ఆరా తీస్తున్నారు. అయితే కల్కి’ ఓటీటీలో చూడాలంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సినిమా రిలీజైన పది వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకు రానునన్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సెప్టెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది.
కాగా.. ఇప్పటికే 'కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. బాలీవుడ్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment