Adipurush Movie OTT Release Date And Streaming Platform Details Telugu - Sakshi
Sakshi News home page

Adipurush OTT Telugu: 'ఆదిపురుష్' ఓటీటీ డీటైల్స్ ఇవే!

Jun 16 2023 10:03 AM | Updated on Jun 16 2023 10:37 AM

Adipurush OTT Release Date Streaming Details Telugu - Sakshi

డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దాదాపు ప్రతిఒక్కరూ రాముని భక్తిలో మునిగిపోతున్నారు. థియేటర్లని దేవాలయాలుగా మార‍్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్నిచోట్ల తొలిరోజు షోలన్నీ దాదాపు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇదే టైంలో 'ఆదిపురుష్' ఓటీటీ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి.

ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రభాస్ తోపాటు సైఫ్ అలీఖాన్, కృతిసనన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. గతేడాది టీజర్ రిలీజ్ టైంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా.. రిలీజ్ కి ముందు కాస్త హైప్ క్రియేట్ చేసుకుంది.

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'ఆదిపురుష్' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. రీసెంట్ గా ఇది చెప్పారు గానీ బిగ్ స్క్రీన్ పై బొమ్మపడిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్ నడుస్తోంది. దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో?

(ఇదీ చదవండి: ఓ రేంజులో 'ఆదిపురుష్' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement