హరీష్ శంకర్ (ఫైల్)
సినిమా పరిశ్రమ పైరసీ భూతం కొత్తేం కాదు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో పైరసీ నానాటికి పెరుగుతోంది. పైరసీకి గురికాని సినిమా ఉండదేమో అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. విడుదలైన సినిమాలనే కాదు విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను కూడా పైరసీ చేసేస్తున్నారు. పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా పైరసీని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు.
టాలీవుడ్‌లో గతేడాది విడుదలైన సినిమాల్లోబాహుబలి2, డీజే సినిమాలు ఎక్కవగా పైరసీకి గురయ్యాయని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఈ రెండు సినిమాలను ఎక్కువ మంది షేర్ చేసుకున్నారనీ, పైరసీ ద్వారా వీక్షించారనీ ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో అర్జున్‌రెడ్డి మూడో స్థానంలో ఉంది. ఈ పైరసీ విషయంపై డీజే డైరెక్టర్ హరీష్‌శంకర్ ట్విటర్‌లో స్పందిస్తూ...‘ఖర్మ!!!’ అంటూ పోస్ట్ చేశారు.
ఖర్మ !!!!! https://t.co/jnFROXBi9u pic.twitter.com/UbmYEJC6ZZ
— Harish Shankar .S (@harish2you) March 22, 2018
Comments
Please login to add a commentAdd a comment