dj movie
-
అల్లు అర్జున్ 'డీజే' సినిమాకు పనిచేశాను: యంగ్ హీరో
‘హుషారు, రౌడీ బాయ్స్’ చిత్రాల ఫేమ్ తేజ్ కూరపాటి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల ఆకర్షణ హీరోయిన్. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తేజ్ కూరపాటి మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. సినిమాపై ప్యాషన్‌తో డైరెక్షన్ కోర్స్ చేశాను. బెక్కం వేణుగోపాల్‌గారు ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘డీజే’ సినిమాకి హరీష్ శంకర్‌గారి వద్ద కొద్ది రోజులు పనిచేశాను. ఆ తర్వాత బెక్కం వేణుగోపాల్‌గారి ‘హుషారు’ లో నలుగురు హీరోల్లో ఒకడిగా చేశా. ఆ తర్వాత ‘రౌడీ బాయ్స్’ లో సెకెండ్ హీరోగా చేశాను. ఆ తర్వాత ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ సినిమాలో సోలో హీరోగా అవకాశం వచ్చింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. నేను నటించిన ‘షికారు’ చిత్రం జూన్ 24న రిలీజ్ అవుతుంది. హర్ష కొనగంటిగారితో ఓ చిత్రం, ‘దిల్’ రాజుగారి ప్రొడక్షన్లో ఓ సినిమా, బెక్కం వేణుగోపాల్‌తో ఓ సినిమా ఓకే అయ్యాయి’’ అన్నారు. చదవండి: బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు.. హీరోయిన్ ఘాటు రిప్లై -
తెలుగు సినిమాలపై బాలీవుడ్ కన్ను.. స్పెషల్ వీడియో
ఒకప్పుడు తెలుగులో మిగతా భాష చిత్రాలు రీమేక్ లేదా డబ్ అవ్వడం జరిగేది. ఇతర పరిశ్రమలు మన తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపేవే కాదు. ముఖ్యంగా బాలీవుడ్. హిందీలో మన సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు భాష చిత్రాల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మన సినిమాలు బి-టౌన్లో భారీ స్థాయిలో మార్కెట్ చేయడంతో బాలీవుడ్ వరుస పెట్టి మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే జెర్సీ రీమేక్ హక్కులను సొంతంగా చేసుకున్న బి-టౌన్ మరిన్ని చిత్రాలను కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. మరీ రీమేక్ కోసం బాలీవుడ్ కన్నేసిన మన తెలుగు సినిమావో ఓ లుక్కేద్దాం. -
‘ఖర్మ’ అంటూ పోస్ట్ పెట్టిన టాప్‌డైరెక్టర్
సినిమా పరిశ్రమ పైరసీ భూతం కొత్తేం కాదు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో పైరసీ నానాటికి పెరుగుతోంది. పైరసీకి గురికాని సినిమా ఉండదేమో అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. విడుదలైన సినిమాలనే కాదు విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను కూడా పైరసీ చేసేస్తున్నారు. పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా పైరసీని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. టాలీవుడ్లో గతేడాది విడుదలైన సినిమాల్లోబాహుబలి2, డీజే సినిమాలు ఎక్కవగా పైరసీకి గురయ్యాయని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఈ రెండు సినిమాలను ఎక్కువ మంది షేర్ చేసుకున్నారనీ, పైరసీ ద్వారా వీక్షించారనీ ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో అర్జున్‌రెడ్డి మూడో స్థానంలో ఉంది. ఈ పైరసీ విషయంపై డీజే డైరెక్టర్ హరీష్‌శంకర్ ట్విటర్లో స్పందిస్తూ...‘ఖర్మ!!!’ అంటూ పోస్ట్ చేశారు. ఖర్మ !!!!! https://t.co/jnFROXBi9u pic.twitter.com/UbmYEJC6ZZ — Harish Shankar .S (@harish2you) March 22, 2018 -
‘డీజే’ పాటలో ఆ పదాలను తొలగిస్తాం
- బ్రాహ్మణ సంఘాలతో దర్శకుడు హరీశ్ శంకర్, కవి సాహితి సాక్షి, హైదరాబాద్ బ్యూరో: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నఅల్లు అర్జున్ ‘డీజే– దువ్వాడ జగన్నాథం’ సినిమాను దర్శకుడు హరీశ్ శంకరే స్వయంగా గట్టెక్కించారు. సినిమాలోని ఓ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారాల’ అనే పదాలను తొలగిస్తామని ఆ సినిమా దర్శకుడు హరీశ్‌శంకర్, గీత రచయిత సాహితి తెలిపారు. చిత్రంలోని ఓ పాటలో కొన్ని పదాలను ఉపయోగించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం నేతలు సోమవారం ‘డీజే’ సినిమా దర్శకుడు హరీష్‌శంకర్‌ను, గేయ రచయిత సాహితిని వారి కార్యాలయంలో కలిశారు. ‘నమక, చమకాల’ ప్రాశస్త్యాన్ని వివరించి, ఆ పదాలను తొలగించాలని కోరారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో పాటను రాయలేదని, పండితుల, బ్రాహ్మణ సంఘాల కోరిక మేరకు వాటిని మారుస్తామన్నారు. పాటలో మార్పుచేర్పులకు అంగీకరించిన దర్శక నిర్మాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ద్రోణంరాజు రవికుమార్, తులసి శ్రీనివాస్, గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, సుబ్బూజీ తదితరులు పాల్గొన్నారు.