అల్లు అర్జున్‌ 'డీజే' సినిమాకు పనిచేశాను: యంగ్‌ హీరో | Tej Kurapati About Naa Venta Paduthunna Chinnadevadamma Movie | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ 'డీజే' సినిమాకు పనిచేశాను: యంగ్‌ హీరో

Published Mon, May 23 2022 8:11 AM | Last Updated on Mon, May 23 2022 8:11 AM

Tej Kurapati About Naa Venta Paduthunna Chinnadevadamma Movie - Sakshi

‘హుషారు, రౌడీ బాయ్స్‌’ చిత్రాల ఫేమ్‌ తేజ్‌ కూరపాటి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌ వందెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల ఆకర్షణ హీరోయిన్‌. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తేజ్‌ కూరపాటి మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. సినిమాపై ప్యాషన్‌తో డైరెక్షన్‌ కోర్స్‌ చేశాను. బెక్కం వేణుగోపాల్‌గారు ‘నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్‌’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. 

ఆ తర్వాత అల్లు అర్జున్‌ ‘డీజే’ సినిమాకి హరీష్‌ శంకర్‌గారి వద్ద కొద్ది రోజులు పనిచేశాను. ఆ తర్వాత బెక్కం వేణుగోపాల్‌గారి ‘హుషారు’ లో నలుగురు హీరోల్లో ఒకడిగా చేశా. ఆ తర్వాత ‘రౌడీ బాయ్స్‌’ లో సెకెండ్‌ హీరోగా చేశాను. ఆ తర్వాత ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’  సినిమాలో సోలో హీరోగా అవకాశం వచ్చింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. నేను నటించిన ‘షికారు’ చిత్రం జూన్‌ 24న రిలీజ్‌ అవుతుంది. హర్ష కొనగంటిగారితో ఓ చిత్రం, ‘దిల్‌’ రాజుగారి ప్రొడక్షన్‌లో ఓ సినిమా, బెక్కం వేణుగోపాల్‌తో ఓ సినిమా ఓకే అయ్యాయి’’ అన్నారు.  

చదవండి: బెడ్‌ సీన్‌ను ఎన్నిసార్లు షూట్‌ చేశారు.. హీరోయిన్‌ ఘాటు రిప్లై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement