పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన దిల్ రాజు | Harish Shankar, Dil raju Moves For Police Complaint | Sakshi
Sakshi News home page

పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన దిల్ రాజు

Published Wed, Jun 28 2017 1:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన దిల్ రాజు

పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన దిల్ రాజు

తన 25వ సినిమాగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్లతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. తొలి వారాంతానికి అల్లు అర్జున్ కెరీర్లో హయ్యస్ట్ వీకెండ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా డీజే నిలిచింది. అయితే ఈ సినిమాపై పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. దీంతో సినిమా పైరసీకి పాల్పడిన వారిపై చిత్రయూనిట్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది.

నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్లు స్వయంగా ఈ కంప్లయింట్ ఇచ్చారు. కొన్ని వెబ్ సైట్స్తో పాటు ఫేస్ బుక్ పేజ్లపైన కూడా కంప్టయింట్ ఇచ్చినట్టుగా తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ గత శుక్రవారం రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ సాధించింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే వస్తుండటంతో సినిమా టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్ లిస్ట్లో చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement