
విజయ్ తాజా సినిమా 'మెర్సల్'ను పైరసీ భూతం వెంటాడుతోంది. తాజాగా విడుదలై భారీగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా డౌన్‌లోడ్ లింకులు టోరెంట్ సైట్లలో కుప్పులుతెప్పలుగా కనిపిస్తున్నాయి. సినిమా పైరసీ బారిన పడకుండా చిత్ర నిర్మాతలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినా, విడుదల రోజు 'మెర్సల్' ఫుల్‌మువీ పైరసీ సైట్లలో కనిపించడం గమనార్హం.
పైరేట్‌బే, తమిళ్‌రాకర్స్ వంటి టోరెంటో సైట్లలో ఈ సినిమా డౌన్‌లోడ్ లింక్స్ యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. పైరేట్ బే వెబ్‌సైట్‌లో ఈ సినిమాను ఇప్పటికే 8వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక తమిళరాకర్స్ వెబ్‌సైట్ కొత్త హోస్ట్ సైట్‌ను క్రియేట్ చేసి.. ఈ సినిమా డౌన్‌లోడ్ లింక్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా మరో ప్రాక్సీ సర్వర్ (tamilrocker.fi) ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
మెర్సల్ వర్సెస్ మోదీ వివాదం తెరపైకి రావడంతో ఈ సినిమా డౌన్‌లోడ్‌లు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. విజయ్ సరసన కాజోల్, సమంత, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా అవినీతి వైద్యులు, వైద్య వ్యవస్థ నేపథ్యంగా తెరకెక్కింది. దేశంలో అత్యధిక మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నా.. ఎందుకు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం లేదని నిలదీస్తూ.. ఈ సినిమాలో విజయ్ చేసిన డైలాగులు సంచలనం రేపాయి. జీఎస్టీని ప్రశ్నిస్తూ.. సాగిన ఈ డైలాగులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేయడం రాజకీయ రంగు పులుముకుంది. ఇక, ఈ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాలపై విమర్శలు చేస్తూ విజయ్ డైలాగులు చెప్పే సీన్లు సైతం ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో లీక్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment