ఇంటర్నెట్ లో హిట్ సినిమా; ముగ్గురు అరెస్ట్ | Three students nabbed by police for Malayalam film 'Premam' leak | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ లో హిట్ సినిమా; ముగ్గురు అరెస్ట్

Published Tue, Jul 7 2015 6:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

ఇంటర్నెట్ లో హిట్ సినిమా; ముగ్గురు అరెస్ట్

ఇంటర్నెట్ లో హిట్ సినిమా; ముగ్గురు అరెస్ట్

తిరువనంతపురం: మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్'ను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ముగ్గురు స్కూల్ విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లామ్ లో మంళవారం తెల్లవారుజామున వీరిని యాంటీ పైరసీ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా, ఆకతాయితనంగా చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన 'ప్రేమమ్' సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. రిలీజైన రెండు వారాల్లో... ఒక్క కేరళలోనే రూ. 20 కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించి, 'మల్లు' ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement