తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విబేధాలు తారస్థాయికి చేరాయి. హీరో అరెస్ట్‌తో గురువారం నిర్మాతల మండలి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని.. పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్‌సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు. ఇక మీదట నిర్మాతల మండలిలోకి రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు కొందరు కార్యాలయానికి తాళం వేశారు.
దాంతో విశాల్ తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకూ చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా విశాల్‌కు, నిర్మాతలకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. దాంతో ఓ వర్గం వారు విశాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేలా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ చిన్న సినిమాల నిర్మాతలు విశాల్‌ను నిలదీస్తున్నారు.
కాగా అరెస్ట్ విషయమై విశాల్ ట్విటర్‌లో స్పందించారు. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న తమిళ నిర్మాతల మండలికి తాళం వేశారు. అప్పుడు స్పందించని పోలీసులు.. నేడు మా తప్పేం లేకపోయినప్పటికి నన్ను, నా సహచరులను అరెస్ట్ చేశారు. దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ విషయం గురించి పోరాటం చేస్తానం’టూ ట్వీట్ చేశారు.
Police who were mute yesterday wen unauthorised ppl locked the doors & gates of TFPC have arrested me & my colleague today for no fault of ours,absolutely unbelievable
— Vishal (@VishalKOfficial) December 20, 2018
We will fight back,wil do everything to conduct Ilayaraja sir event & raise funds to help Producers in distress
Comments
Please login to add a commentAdd a comment