
సాధారణంగా సినిమా పోస్టర్ తో పాటు ఆడియో రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేయటం చూస్తుంటాం. కానీ ఓ తమిళ సినిమా నిర్మాతలు ఏకంగా ఈ సినిమా ఎప్పుడు పైరసీ వర్షన్ వస్తుందో కూడా ఎనౌన్స్ చేశారు. కోలీవుడ్ ఘన విజయం సాధించిన తమిళపడం సినిమాకు సీక్వల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ పడం 2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను వినూత్నంగా ప్రకటించారు చిత్రయూనిట్.
తమిళ హీరో సిద్ధార్థ్ రిలీజ్ చేసిన పోస్టర్ లో టైటిల్ లోగోతో పాటు సినిమాను 25 మే 2018 న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆ మరుసటి రోజు 26 మే 2018న సినిమా తమిళ రాకర్స్ వెబ్ సైట్ లో పైరసీ వర్షన్ రిలీజ్ అవుతుందని అదే పోస్టర్ లో ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోల సినిమాల పేరడీ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అముదన్ దర్శకుడు.
Ellame inimey oru maadhiriya dhaan nadakkum! Happy to launch the release poster of #TP2point0 No theory. Only practical. A @csamudhan classic. Starring Akila Ulaga Superstar @actorshiva Puratchi producer @sash041075 Joooot!!! pic.twitter.com/q4BDw9ZcjH
— Siddharth (@Actor_Siddharth) 9 December 2017
Comments
Please login to add a commentAdd a comment