
చట్టం అమలు ఓ జోకైపోయింది: రాజమౌళి
మన దేశంలో చట్టాల అమలు అంటే ఓ పెద్ద జోకుగా మారిపోయిందని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలంటూ ఎన్ని కోర్టులు చెబుతున్నా, ఎంత పటిష్ఠమైన చట్టాలున్నా కూడా బాహుబలి లాంటి సినిమాలు సైతం ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయంటూ సాక్షి ఖన్నా అనే పాత్రికేయురాలు చేసిన ట్వీట్కు సమాధానంగా రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటూ టాలీవుడ్లోని పలువురు హీరోలు, ఇతర ప్రముఖులు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇలా కామెంట్ చేశారు.
Sadly, law enforcement is a joke In our country https://t.co/YAnqovSeBb
— rajamouli ss (@ssrajamouli) September 3, 2015