వెయ్యి కొట్టు... ఏడాదంతా సినిమా చూడు | Shanmuga cinema theater to launch a scheme for audience | Sakshi
Sakshi News home page

వెయ్యి కొట్టు... ఏడాదంతా సినిమా చూడు

Published Wed, Mar 11 2015 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

Shanmuga cinema theater to launch a scheme for audience

తమిళనాడు : ఆషాఢమాసం తగ్గింపు ధరలంటూ వ్యాపారస్తులు గల్లాపెట్టెలు నింపుకునే ప్రయత్నం చేస్తుండటం చూస్తుంటాం. ఈ వ్యాపార ట్రిక్కు సినిమా వాళ్లు ఉపయోగించుకునే ప్రయత్నంలో పడ్డారు. పైరసీని అరికట్టేందుకేనంటున్నారు ఒక సినీ థియేటర్ అధినేత. వివరాల్లో కెళితే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో షణ్ముగ సినిమా థియేటర్ ఉంది. ఈ థియేటర్ అధినేత ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు.

ఒక ప్రేక్షకుడు వెయ్యి రూపాయలు టికెట్ కొంటే ఆ ఏడాదంతా ఆ థియేటర్‌లో ఆడే కొత్త చిత్రాలను ఒకసారి చూడవచ్చట. ఒకవేళ అతడికి చిత్రం చూసేందుకు ఆసక్తి లేకపోతే తన తరపున ఎవరినైనా పంపవచ్చు. ఈ విధానాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ విధానంలో రెండు వేల టికెట్లు విక్రయించారట. పదివేల టికెట్లు అమ్మాలన్నది థియేటర్ యాజమాన్యం లక్ష్యం. ఈ కొత్త పథకానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందట. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా టికెట్ కొన్న వారికి ఆ ఊరులోని పది దుకాణాల్లో ఏదైనా కొనుగోలు చేస్తే ఐదు శాతం తగ్గింపు ఉంటుందట. వాటిల్లో ఒక బంగారు దుకాణం కూడా ఉంది. అందులో సవరం బంగారం కొనుగోలు చేస్తే రూ.1250 తగ్గింపు ఉంటుందట. ఈ పథకం సక్సెస్ అయితే రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement