
అది చాలా చెడ్డ పని: కంగనా
ముంబయి: పైరసీ భూతం బాలీవుడ్ నటులను తెగ భయపెడుతోందట. షారుక్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, కంగనా రనౌత్ తోపాటు దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు అతిపెద్ద ముప్పు ఏదైనా ఉంటే అది పైరసీనే అని దాన్ని ఎట్టి పరిస్ధితుల్లో నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇటీవల తీవ్ర పోరాటం అనంతరం విడుదలైన ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి చిత్రాలు థియేటర్ లోకి రాకముందే ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కంగనా స్పందనా కోరగా ..'ఇది సినిమా పరిశ్రమకు పెద్ద చేటు. మేం ఎంతో కష్టపడి పనిచేస్తాం. ఇది ఒక రకంగా అతిక్రమణే.. వెంటనే ఆ పనిచేసేవాళ్లు ఆపేయాలి. పైరసీ అంటే దొంగతనమే. దాన్ని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఇది ఒక రకంగా చెడు ప్రవర్తన' అంటూ చెప్పింది. అలాగే మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు పైరసీ విషయం లో స్పందించారు.