ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్ | Kollywood Hero Dhanush Love Story Goes Viral In Social Media | Sakshi

Dhanush: 'అమ్మాయితో చాటింగ్ చేయడం వల్లే అంతా'.. నెట్టింట వైరల్!

Published Wed, Sep 6 2023 2:06 PM | Last Updated on Wed, Sep 6 2023 2:32 PM

Kollywood Hero Dhanush Love Story Goes Viral In Social Media - Sakshi

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్‌డమ్‌ దక్కించుకున్న హీరో ధనుశ్. రఘువరన్‌ బీటెక్ సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.  ప్రస్తుతం హిందీతో పాటు హాలీవుడ్‌లో నటిస్తున్నారు. . హాలీవుడ్‌లో తెరకెక్కిన ది గ్రే మ్యాన్ చిత్రంలో కనిపించారు.  ఇటీవలే తెలుగులో  వచ్చిన సార్‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రాబోయే ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నారు ధనుశ్. అయితే రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న హీరో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. 

(ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!)

అయితే తాజాగా ధనుశ్‌ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాను సినిమాల్లోకి రాకముందే ప్రేమలో పడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో ధనుశ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ టాపిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

గతంలో సార్ మూవీ ఈవెంట్‌లో ధనుశ్ మాట్లాడుతూ.. 'టెన్త్‌ క్లాస్‌లో ఉండగా బాగా చదివేవాడిని. క్లాస్‌లో ఎప్పుడూ నేనే టాపర్‌గా వచ్చేవాడిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌లో ఓ అమ్మాయి పరిచయం కాగా.. ప్రేమలో పడ్డాను. ఇక అప్పటి నుంచి ఓన్లీ చాటింగ్‌ చేయడమే నా పని. చదువును పూర్తిగా గాలికొదిలేశా. ఆ అమ్మాయి వల్లే చదువులో వెనకపడ్డా. కానీ అతికష్టం మీద ఇంటర్ ఎలాగోలా పాసయ్యా.' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ధనుశ్ ప్రస్తుతం అరుణ్ మాతీశ్వరన్ తెరకెక్కిస్తోన్న కెప్టెన్ మిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. 

(ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ టార్గెట్‌ విజయ్‌?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement