స్టార్ హీరో లేటెస్ట్ మూవీ.. న్యూ ఇయర్‌కు క్రేజీ అప్‌డేట్ | Kollywood Star Vishal latest Movie Rathnam First Look Released | Sakshi
Sakshi News home page

Rathnam: ఫుల్ మాస్ యాక్షన్‌తో వస్తోన్న 'రత్నం'.. సాంగ్ రిలీజ్!

Published Mon, Jan 1 2024 5:19 PM | Last Updated on Mon, Jan 1 2024 5:42 PM

Kollywood Star Vishal latest Movie Rathnam First Look Released - Sakshi

ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విశాల్ నటిస్తోన్న చిత్రం రత్నం. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హరీ దర్శకత్వం వహిస్తుండగా.. కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌తో పాటు లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. 

పోస్టర్ చూస్తే విశాల్ ఎన్నడూ కనిపించని ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫస్ట్‌లుక్‌తో పరాటు ఓ  లిరికల్ పాటను విడుదల చేశారు. 'రా రా రత్నం' అంటూ సాగే ఈ పాట మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి.  వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement