నాకు రూ.1000 కోట్ల ఆస్తి ఉంది : హీరో | Simbu Says I have 1000 Crores For Myself | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 6 2018 3:52 PM | Last Updated on Wed, Jun 6 2018 4:10 PM

Simbu Says I have 1000 Crores For Myself - Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో శింబు ఒకేసారి మూడు చిత్రాలను ప్రకటించాడు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాలతో పాటు తన డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సినిమాలు చేయటం కాదు ముందు షూటింగ్‌లకు సరైన సమయానికి రావటం నేర్చుకోమంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. అయితే కామెంట్స్‌పై డైరెక్ట్‌గా స్పందించకపోయినా... విమర్శలకు బదులిస్తూ కోలీవుడ్‌ మీడియాకు శింబు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది.

‘నేను నా తొలి సినిమా చేసినప్పుడు కూడా మా నాన్నతో కలిసి 10 గంటలకు సెట్‌కు వెళ్లాను. అది నా నిర్లక్ష్యం కాదు. నేను ఎప్పుడూ ఇలాగే జీవిస్తున్నా. నేను చాలా కంఫర్టబుల్‌గా బతికాను. రోబోలా జీవించటం నా వల్ల కాదు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా వ్యక్తిగతంగా నేను జీవితంలో సెటిల్‌ అయ్యాను. నాకు రూ.1000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. నా జీవితాన్ని నేను ఆనందంగా జీవించగలను. నాకు సినిమా అంటే ఇష్టం అందుకే ఈ రంగంలో కొనసాగుతున్నాను. నాకు స్వార్థపరుడ్ని అనిపించుకోవాలనే ఉద్దేశం లేదు. అందుకే నా పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా ప్రవర్తన మార్చుకుంటా, ప్రస్తుతం అదే పనిలో ఉన్నా’ అంటూ క్లారిటీ ఇచ్చారు శింబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement