విక్రమ్‌ తంగలాన్‌.. ఈ స్పెషల్ వీడియో చూశారా? | Thangalaan Team Shares Special Video Tribute To Tamil Star Chiyaan Vikram Birthday - Sakshi
Sakshi News home page

Thangalaan: విక్రమ్‌ తంగలాన్‌ అప్‌డేట్‌.. బర్త్‌ డే గ్లింప్స్‌ చూశారా?

Apr 18 2024 1:44 PM | Updated on Apr 18 2024 1:53 PM

Kollywood Star Vikram Thangalaan Birthday Special Update  - Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన తాజా చిత్రం తంగలాన్‌. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా నటించారు. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కె ఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా రోజుల ముందే తెరపైకి రావాల్సింది. అయి తే గ్రాఫిక్స్‌ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పటికీ దర్శక, నిర్మాతలు తంగలాన్‌ చిత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. 

తాజాగా ఈనెల 17న విక్రమ్ బర్త్‌ డే కావడంతో మేకర్స్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ తంగలాన్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆదివాసి ప్రాంతాలలో నటుడు విక్రమ్‌ గుర్రమెక్కి వెళుతున్న పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో విక్రమ్‌ కొండవాసీ గెటప్‌లో కనిపించిన దృశ్యం తంగలాన చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ మాట్లాడుతూ తంగలాన్‌ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ కె ఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్‌ విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. తంగలాన్‌ చిత్రం కోసం విక్రమ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యాయన్నారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారన్నారు. ఇతర నటీనటులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఇది గోల్డ్‌ మైన్స్‌ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పా.రంజిత్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement