
తమిళ స్టార్ హీరో గతేడాది తునివు(తెగింపు) చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్ కుమార్ విడాయమర్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.
ఇదిలా ఉండగా అజిత్ సడన్‌గా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇంతకీ తమ హీరోకు అసలు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారంటూ సన్నిహితులు వెల్లడించారు.
కానీ తాజాగా ఆయన హెల్త్ అప్‌డేట్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆయన నరాల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చెవిని మెదడుకు కలిపే నరంలో వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని అజిత్ ప్రతినిధి సురేష్ చంద్ర తెలిపారు. అంతే కాకుండా బ్రెయిన్ సిస్ట్‌తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అజిత్ సర్జరీ గురించి వచ్చిన కథనాలు అవాస్తవమని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సురేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పూర్తయిందని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment