![Kollywood Star Hero Vishal Shokcing Comments On National Awards - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/3/mark-antony.jpg.webp?itok=2mqUAiKt)
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ'. ఈ చిత్రంలో రీతూ వర్మ జంటగా నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ చెన్నైలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు విశాల్. ఈ సందర్భంగా ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అవార్డులపై తనకు ఎలాంటి నమ్మకం లేదని, ఒకవేళ తనకు అవార్డులు వస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తానని విమర్శించారు.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే!)
విశాల్ మాట్లాడుతూ.. ' నాకు అవార్డులపై నమ్మకం లేదు. ప్రజలు, అభిమానులు ఇచ్చేదే నిజమైన అవార్డు. ప్రేక్షకుల ఆశీస్సులతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా. ఒకవేళ నా చిత్రాలకు అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తా. రాజకీయ ఎంట్రీపై ప్రశ్నించగా.. జీవితంలో ఏదైనా జరగొచ్చు. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. మన చేతుల్లో లేదు.' అంటూ బదులిచ్చారు. \
(ఇది చదవండి: 1980ల్లో స్టార్ హీరోయిన్.. మద్యానికి బానిసై కెరీర్ నాశనం!)
Comments
Please login to add a commentAdd a comment