స్టార్‌ హీరో బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సూపర్‌ హిట్ డైరెక్టర్‌తోనే! | Suriya To Make Debut Bollywood With Rakeysh Omprakash Mehra | Sakshi
Sakshi News home page

Suriya: సూర్య బాలీవుడ్ ఎంట్రీ.. ఆ పాత్రకు సెట్టయ్యేనా?

Published Mon, Sep 18 2023 8:39 AM | Last Updated on Mon, Sep 18 2023 10:26 AM

Kollywood Star Hero Suriya Acts Movie WIth Rakeysh Omprakash Mehra - Sakshi

మహాభారతం పురాణ ఇతిహాసమే కాదు.. సినీ పరిశ్రమకు అదో భాండాగారమనే చెప్పాలి. ఇప్పటికే మహాభారతం ఎన్నో భాషల్లో ఎన్నో చిత్రాలు రూపొంది ప్రేక్షకులను భక్తి సంద్రంలో ముంచెత్తాయి. త్వరలోనే మరెన్నో చిత్రాలు రానున్నాయి. మహాభారతం ఇతిహాసంలో ఒక్కో పాత్రకు ఒక్కో చరిత్ర ఉంది. అలాగే తాజాగా మహాభారతంలోని దానకర్ణుని ఇతివృత్తాన్ని తీసుకుని తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది.

తాజా సమాచారం కోలీవుడ్‌ స్టార్‌ నటుడు సూర్య బాలీవుడ్‌ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం కంగువ అనే భారీ చారిత్రక కథా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీంతో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్రంలో కూడా నటించాల్సి ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో సూర్య బాలీవుడ్‌ ఎంట్రీ చిత్రం గురించి టాక్‌ వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలో సూర్య నటించడానికి సిద్ధమవుతున్నట్లు బీ టౌన్‌ లేటెస్ట్ టాక్. రంగ్‌ దే బసంతి, భాగ్‌ మిల్కా భాగ్‌ వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఈ దర్శకుని సొంతం. కాగా తాజాగా కర్ణ అనే చిత్రాన్ని సూర్య కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించడానికి తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో రెండు భాగాలుగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే తాజాగా సూర్య దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement