Rakeysh Omprakash Mehra
-
స్టార్ హీరో బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సూపర్ హిట్ డైరెక్టర్‌తోనే!
మహాభారతం పురాణ ఇతిహాసమే కాదు.. సినీ పరిశ్రమకు అదో భాండాగారమనే చెప్పాలి. ఇప్పటికే మహాభారతం ఎన్నో భాషల్లో ఎన్నో చిత్రాలు రూపొంది ప్రేక్షకులను భక్తి సంద్రంలో ముంచెత్తాయి. త్వరలోనే మరెన్నో చిత్రాలు రానున్నాయి. మహాభారతం ఇతిహాసంలో ఒక్కో పాత్రకు ఒక్కో చరిత్ర ఉంది. అలాగే తాజాగా మహాభారతంలోని దానకర్ణుని ఇతివృత్తాన్ని తీసుకుని తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. తాజా సమాచారం కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య బాలీవుడ్ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం కంగువ అనే భారీ చారిత్రక కథా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీంతో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో కూడా నటించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య బాలీవుడ్ ఎంట్రీ చిత్రం గురించి టాక్ వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య నటించడానికి సిద్ధమవుతున్నట్లు బీ టౌన్ లేటెస్ట్ టాక్. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఈ దర్శకుని సొంతం. కాగా తాజాగా కర్ణ అనే చిత్రాన్ని సూర్య కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించడానికి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రెండు భాగాలుగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే తాజాగా సూర్య దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అప్పుడు తప్పతాగి చనిపోవాలనుకున్నా: డైరెక్టర్
Rakeysh Omprakash Mehra: జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కొన్నిసార్లు ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలే విజయానికి నాందిగా మారుతాయి. కానీ కొందరు మాత్రం ఓటమికి కుంగిపోయి అక్కడే ఆగిపోతారు. దాన్నుంచి బయటపడేందుకు నానాతంటాలు పడతారు. దర్శకుడు రాఖేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కూడా జీవితంలో ఇలాంటి స్థితిని దాటి వచ్చినవాడే. అతడు తెరకెక్కించిన 'ఢిల్లీ 6' చిత్రం 2009లో రిలీజైంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సమయంలో అతడు ఓరకంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని తన ఆటోబయోగ్రఫీ 'ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్'లో ప్రస్తావించాడు. 'ఢిల్లీ 6' సినిమా ఫ్లాప్ అవడంతో తను ఎంతగానో బాధపడ్డానన్నాడు. థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు మూవీ ఇంకా పూర్తవకముందే ప్రేక్షకులు విసురుగా బయటకు వెళ్లిపోయేవారని తెలిపాడు. అంతేకాక రానురానూ ఏకంగా చంపుతామని బెదిరింపులు కూడా మొదలవడంతో ఎవరికీ తెలియని చీకటి ప్రదేశంలోకి వెళ్లిపోయి తలదాచుకున్నానని గుర్తు చేసుకున్నాడు. ఈ బాధను, ఫెయిల్యూర్‌ను భరించలేక తాగుడుకు బానిసయ్యానని వెల్లడించాడు. ఒకానొక సమయంలో పీకల్దాకా తాగి చనిపోవాలనుకున్నానని, శాశ్వత నిద్రలోకి జారుకోవాలని చూశానన్నాడు. తన ప్రవర్తనతో భార్య భారతి, కూతురు భైరవిని క్షోభ పెట్టానని, మరోపక్క కొడుకు వేదాంత్‌తో దూరం కూడా పెరిగిందని బాధపడ్డాడు. ఇలా తాను ప్రేమించేవాళ్లందనీ నిర్లక్ష్యం చేసి వారిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. కాగా ఈ దర్శకుడు తర్వాతి కాలంలో 'రంగ్‌దే బసంతి', 'భాగ్ మిల్కా భాగ్' వంటి హిట్ చిత్రాలను అందించాడు. ఇటీవలే ఓటీటీలో వచ్చిన 'తుఫాన్' చిత్రంతో మరోసారి మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.