బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! | Kollywood Star Hero Dhanush Acts Again In Bollywood Director Aanand L Rai | Sakshi
Sakshi News home page

Dhanush: కొత్త మూవీ క్రేజీ అప్‌డేట్‌.. ఆ డైరెక్టర్‌తో మూడోసారి!

Published Thu, Sep 7 2023 2:56 PM | Last Updated on Thu, Sep 7 2023 4:35 PM

Kollywood Star Hero Dhanush Acts Again In Bollywood Director Aanand L Rai  - Sakshi

కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ నటించిన హీరో ధనుష్. కథానాయకుడిగా 50 చిత్రాల మైలు రాయిని టచ్‌ చేసిన ఈ టాప్‌ హీరో తన అర్ధ శతకం చిత్రాన్ని తనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌లో రూపొందుతోంది. కాగా ధనుష్‌ తన 51వ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది తెలుగు, తమిళం భాషల్లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ధనుష్‌ బాలీవుడ్‌లో ఇప్పుటికే ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో రాంజానా, అట్రాంగి రే చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది.

(ఇది చదవండి: సీనియర్‌ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా.. )

కాగా తాజాగా ఇదే కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కబోతోంది. దీనికి తేరే ఇష్క్‌ మెన్‌ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. దీనికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించనున్నారు. కాగా ఇందులో ధనుష్‌కు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా బజ్‌ వినిపిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌, మెగా హీరో రామ్‌చరణ్‌ సరసన గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా.. ధనుష్‌ హీరోగా నటించనున్న హిందీ చిత్రం తేరే ఇష్క్‌ మైన్‌ చిత్ర షూటింగ్‌ను నవంబర్‌లో ప్రారంభించి.. మూడు నెలల్లో పూర్తి చేయాలని వచ్చే ఏడాది జూన్‌ 30 తేదీన తెరపైకి తాసుకురావాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇది ఎయిర్‌ఫోర్స్‌ నేపధ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 

(ఇది చదవండి: విక్రమ్‌, జైలర్‌ సినిమాలను మించిపోయేలా పాన్‌ ఇండియా రేంజ్‌లో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement