విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించి దర్శకుడిగా తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం పిచ్చైక్కారన్–2. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదిన విడుదలకు సిద్ధమవుతోంది.
(ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!)
విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో సరైన వ్యక్తులను పెట్టాం. ఎడిటింగ్, మ్యూజిక్, డైరెక్షన్.. ఇలా టెక్నికల్ వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల తెలుగు నేర్చులేకపోయా. భవిష్యత్తులో తప్పకుండా తెలుగులో మాట్లాడతా. హీరోయిన్ కావ్య థాపర్ ప్రమాదం నుంచి నన్ను రక్షించింది. నేను చేసిన పొరపాటు వల్లే చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. బిచ్చగాడు చూసిన మిమ్మల్ని ఈ సినిమా నిరాశపరచదు.' అని విజయ్ అన్నారు. అడివి శేష్ నటించిన గూఢచారి’ సినిమాని చూశానని.. అలాంటి సినిమాలో నటించడమేకాకుండా కథను స్వయంగా రాయడం కష్టమన్నారు. ఆకాశ్ పూరీ నటించిన సినిమా బాగా ఆకట్టుకుందన్నారు.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు. ముందుగా నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ పొంగల్ రోజున విజయ్ ఆంటోని సహాయకుడు ఫోన్ చేసి సార్ నీళ్లలో మునిగి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని చెప్పారన్నారు. అప్పుడు తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైందన్నారు. తాను విజయ్ ఆంటోనికి అర్థాంగిగానూ, ఆయన చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
(ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్‌లో ఉండేలా ప్లాన్!)
దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ విజయ్ ఆంటోని మంచి సంగీత దర్శకుడిగా రాణిస్తూ మళ్లీ కథానాయకుడిగా నటించాడు ఎందుకు అని అనుకున్నానని, అయితే పిచ్చైక్కారన్ చిత్రం చూసిన తరువాత తన ఆలోచన మారిందన్నారు. ఇప్పుడు ఈ పిచ్చైక్కారన్–2 చిత్రం ట్రైలర్ చూస్తుంటే అన్ని విషయాలు చక్కగా చేశారనిపిస్తోందన్నారు. విజయ్ ఆంటోని పునర్ జన్మ ఎత్తింది ఆయన సతీమణి ఫాతిమా కోసం, అభిమానుల కోసం అని ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment