యూఏఈ వేదికలపై బీసీసీఐ సంతృప్తి | BCCI team inspects IPL venues in UAE, expresses satisfaction | Sakshi
Sakshi News home page

యూఏఈ వేదికలపై బీసీసీఐ సంతృప్తి

Published Sun, Mar 23 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

యూఏఈ వేదికలపై బీసీసీఐ సంతృప్తి

యూఏఈ వేదికలపై బీసీసీఐ సంతృప్తి

న్యూఢిల్లీ: ఐపీఎల్-7 తొలి విడత మ్యాచ్‌లు నిర్వహించే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)వేదికలపై బీసీసీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. యూఏఈలో మూడు వేదికలైన అబుదాబి, షార్జా, దుబాయ్‌లను బోర్డు బృందం శుక్ర, శనివారాల్లో సందర్శించింది.
 
 ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ ఎం.వి. శ్రీధర్ ఉన్నారు. స్టేడియాల్లోని సౌకర్యాలు, పిచ్‌లు, మీడియా ఎక్విప్‌మెంట్‌ను ఈ బృందం పరిశీలించింది.  ‘వేదికలు బాగున్నాయి. ఇక్కడి మౌలిక సదుపాయాలు ఏ ఇతర అంతర్జాతీయ స్టేడియాలకు తీసిపోవు’ అని శ్రీధర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement