ఐపీఎల్-7లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ 23 పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించింది.
అబుదాబి: ఐపీఎల్-7లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ 23 పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించింది. 133 పరుగుల కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కోల్కతా 18.2 ఓవర్లలో 109 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ల ధాటికి కోల్కతా క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (34) పోరాడినా ఫలితం లేకపోయింది. సందీప్ మూడు, మిచెల్ జాన్సన్ , అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 132 పరుగులు చేసింది. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ (37) టాప్ స్కోరర్. వీరూ మినహా ఇతర టాపార్డర్ బ్యాట్స్మెన్ పరుగుల వేటలో తడబడ్డారు. రుషి ధవన్ 19 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కోల్కతా బౌలర్లు నరైన్, పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టారు.