ముంబై: పేలవ ఆటతీరుతో టీమిండియాలో చోటు కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ చాలా రోజుల తర్వాత పరుగుల సునామీ సృష్టించాడు. విధ్వంసక బ్యాటింగ్తో రెచ్చిపోయి తనలో మునుపటి వాడి తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఐపీఎల్-7లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో సెహ్వాగ్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. వీరూ 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. దీంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నయ్కు పంజాబ్ బ్యాట్స్మెన్ చుక్కలు చూపించారు. ఓపెనర్లు వీరూ, మనన్ వోహ్రా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. వోహ్రా (34) కాస్త సంయమనంతో ఆడినా వీరూ మెరుపు విన్యాసాలతో రెచ్చిపోయాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరూ మరో 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వోహ్రా అవుటయ్యాక.. మ్యాక్స్వెల్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. కాగా వీరూ అదే జోరు కొనసాగించగా, డేవిడ్ మిల్లర్ (38) అండగా నిలిచాడు. ఎట్టకేలకు నెహ్రా బౌలింగ్లో వీరూ అవుటయినా పంజాబ్ స్కోరు అప్పటికే 200 దాటిపోయింది. కాగా వీరూ అవుటయ్యాక చివర్లో కీలక వికెట్లు పడటంతో పంజాబ్ స్కోరు కాస్త తగ్గింది.
ఐపీఎల్-7: వీరేంద్ర సెహ్వాగ్ పరుగుల సునామీ
Published Fri, May 30 2014 9:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement