ఐపీఎల్-7: మ్యాక్స్వెల్ పరుగుల మోత.. పంజాబ్ ఘనవిజయం | IPL-7: Punjab beats Chennai | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: మ్యాక్స్వెల్ పరుగుల మోత.. పంజాబ్ ఘనవిజయం

Published Wed, May 7 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

IPL-7: Punjab beats Chennai

కటక్: ఐపీఎల్ ఏడో అంచెలో పంజాబ్ జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ 44 పరుగులతో చెన్నయ్ సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పూర్తి ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులే చేయగలిగింది. డుప్లెసిస్ (52) హాఫ్ సెంచరీతో పాటు రైనా (35), బ్రెండన్ మెకల్లమ్ (33) రాణించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూపర్ ఫామ్లో మ్యాక్స్వెల్ మరోసారి (38 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) విధ్వంసక విన్యాసాలతో రెచ్చిపోయాడు. కాగా మరోసారి సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. మ్యాక్స్వెల్తో డేవిడ్ మిల్లర్ (47), బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్), సెహ్వాగ్ (30) ఆకట్టుకున్నారు. చెన్నై బౌలర్ మోహిత్ శర్మ రెండు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement