ఐపీఎల్-7: ఢిల్లీపై చెన్నయ్ ఘనవిజయం | IPL-7: Chennai beats Delhi by 93 runs | Sakshi

ఐపీఎల్-7: ఢిల్లీపై చెన్నయ్ ఘనవిజయం

Apr 21 2014 11:23 PM | Updated on Sep 2 2017 6:20 AM

ఐపీఎల్-7లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. సోమవారం ఏకపక్షంగా సాగిన పోరులో చెన్నయ్ 93 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ను మట్టికరిపించింది.

అబుదాబి: ఐపీఎల్-7లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. సోమవారం ఏకపక్షంగా సాగిన పోరులో చెన్నయ్ 93 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ను మట్టికరిపించింది. 178 పరుగుల లక్ష్యంతో దిగిన ఢిల్లీ 15.4 ఓవర్లలో 84 పరుగులకు కుప్పకూలింది. జిమ్మీ నీషమ్ (22) టాప్ స్కోరర్. దినేశ్ కార్తీక్ (21), డుమినీ (15), మురళీవిజయ్ (11) మినహా ఇతర బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. చెన్నయ్ బౌలర్లు ఈశ్వర్ పాండే, అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 177 పరుగులు సాధించింది. సురేశ్ రైనా (56) హాఫ్ సెంచరీకి తోడు ధోనీ (32), డ్వెన్ స్మిత్ (29), డుప్లెసిస్ (24) రాణించారు. ఉనాద్కట్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement