ఐపీఎల్-7: యువరాజ్, విరాట్ వీరంగం | Bangalore beats Delhi in IPL-7 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: యువరాజ్, విరాట్ వీరంగం

Published Thu, Apr 17 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

Bangalore beats Delhi in IPL-7

షార్జా: ఐపీఎల్-7లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ శుభారంభం చేసింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఎనిమిది వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్పై ఘన విజయం సాధించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు మరో 20 బంతులు మిగిలుండగా కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ పార్థివ్ పటేల్ (37)తో పాటు విరాట్ కోహ్లీ (49 నాటౌట్) , యువరాజ్ సింగ్ (29 బంతుల్లో 52 నాటౌట్) విజృంభించారు.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 145 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (6), మురళీ విజయ్ (18)తో పాటు దినేశ్ కార్తీక్ (0), మనోజ్ తివారీ (1) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీంతో ఢిల్లీ 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డుమినీ (48 బంతుల్లో 67 నాటౌట్), రాస్ టేలర్ (43 నాటౌట్) రాణించి జట్టును ఆదుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement