దుబాయ్: ఐపీఎల్-7లో మరో హోరా హోరీ పోరు అభిమానులను కనువిందు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నాలుగు వికెట్లతో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి మరో్ మూడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. డుమినీ (35 బంతుల్లో 52 నాటౌట్), దినేశ్ కార్తీక్ (40 బంతుల్లో 56) మెరుపు హాఫ్ సెంచరీల సాయంతో ఢిల్లీ నెగ్గింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్లు కలిస్, గంభీర్ ఇద్దరూ సున్నా చుట్టేశారు. అయితే రాబిన్ ఊతప్ప (41 బంతుల్లో 55) హాఫ్ సెంచరీకి తోడు మనీష్ పాండే (48), షకీబల్ హసన్ (30 నాటౌట్) రాణించడంతో కోల్కతా స్కోరు 160 దాటింది.
ఐపీఎల్-7: డుమినీ, దినేశ్ దూకుడు.. ఢిల్లీ విజయం
Published Sat, Apr 19 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM
Advertisement
Advertisement