షార్జా: ఐపీఎల్-7 మరోసారి పరుగుల కనువిందు చేసింది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఏడు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్పై ఘనవిజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగా ఛేదించింది. మ్యాక్స్వెల్ ( 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 89) మరోసారి మెరుపు విన్యాసాలతో అలరించాడు. కాగా కొద్దితో సెంచరీ చేజార్చుకున్నాడు. మ్యాక్స్వెల్ వెనుదిరిగాక డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 6 సిక్సర్లతో 51 నాటౌట్) సిక్సర్లతో విజృంభించగా, పుజారా (40 నాటౌట్) అండగా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 191 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (50), శామ్సన్ (52) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. స్టీవెన్ స్మిత్ 27 (నాటౌట్), అభిషేక్ నాయర్ 23 పరుగులు చేశారు.
ఐపీఎల్-7: మ్యాక్స్వెల్, మిల్లర్ పరుగుల పంజా
Published Sun, Apr 20 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
Advertisement
Advertisement