నేడు ఐపీఎల్ కౌన్సిల్ సమావేశం | IPL Governing Council to meet tomorrow | Sakshi
Sakshi News home page

నేడు ఐపీఎల్ కౌన్సిల్ సమావేశం

Published Sat, May 3 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

IPL Governing Council to meet tomorrow

ముంబై: ఐపీఎల్-7లో భాగంగా యూఏఈలో మ్యాచ్‌లు ముగిసిన నేపథ్యంలో గవర్నింగ్ కౌన్సిల్ శనివారం సమావేశం కానుంది. యూఏఈలో మ్యాచ్‌ల నిర్వహణపై సమీక్షతో పాటు పలు ఇతర విషయాలపైనా చర్చించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
 
 ఈ నెల 28న చెన్నైలో జరగాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌ను ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్టేడియానికి మార్చే అవకాశమున్నట్లు పటేల్ పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం నాటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ నెల 27న క్వాలిఫయర్-1 మ్యాచ్ యథావిధిగా చెన్నైలోనే జరుగుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement