దుబాయ్: బ్రెండన్ మెకల్లమ్ మెరుపు విన్యాసాలతో చెలరేగడంతో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఏడు వికెట్లతో ముంబై ఇండియన్స్పై ఘనవిజయం సాధించింది. ఐపీఎల్-7లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో 142 పరుగుల లక్ష్యాన్నిచెన్నయ్ మరో ఆరు బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది. మెకల్లమ్ (53 బంతుల్లో 71 నాటౌట్) సూపర్ హాఫ్ సెంచరీకి తోడు డ్వెన్ స్మిత్ 29, డుప్లెసిస్ 20 పరుగులు చేశారు. ధోనీ 14 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హర్భజన్ రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 141 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (41 బంతుల్లో 50) హాఫ్ సెంచరీకి తోడు కొరీ అండర్సన్ (39), ఆదిత్య తరె (23) రాణించారు. వీరు ముగ్గురు మినహా మిగిలిన బ్యాట్స్మెన్ ఆకట్టుకోలేకపోయారు. చెన్నయ్ బౌలర్లు మోహిత్ శర్మ నాలుగు, హిల్ఫెనాస్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఐపీఎల్-7: బ్రెండన్ బాదుడు.. ముంబైకి చెన్నయ్ షాక్
Published Fri, Apr 25 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement