ఐపీఎల్-7: ముంబై ఎన్నాళ్లకెన్నాళ్లకు.. | IPL-7: Mumbai beats Punjab | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: ముంబై ఎన్నాళ్లకెన్నాళ్లకు..

May 3 2014 7:45 PM | Updated on Sep 2 2017 6:53 AM

ఐపీఎల్-7లో ఐదు వరుస పరాజయాలతో గెలుపు కోసం మొహం వాచిపోయిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది.

ముంబై: ఐపీఎల్-7లో ఐదు వరుస పరాజయాలతో గెలుపు కోసం మొహం వాచిపోయిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఐదు వికెట్లతో కింగ్స్ లెవెన్ పంజాబ్పై విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. రోహిత్ శర్మ  (39), కొరీ అండర్సన్ (35) , గౌతమ్ (33) రాణించగా, చివర్లో పొలార్డ్ (28 నాటౌట్), ఆదిత్య తరె  (16 నాటౌట్) జట్టును గెలిపించారు. రుషీ దవన్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా (59 నాటౌట్) హాఫ్ సెంచరీకి తోడు మ్యాక్స్వెల్ (45) రాణించాడు. ముంబై బౌలర్లు హర్భజన్ రెండు, మలింగ, అండర్సన్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement