ఐపీఎల్-7లో ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఆరు వికెట్లతో ఓటమి చవిచూసింది.
షార్జా: ఐపీఎల్-7లో ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఆరు వికెట్లతో ఓటమి చవిచూసింది. ముంబై నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మురళీ విజయ్ (40), కెవిన్ పీటర్సన్ (26 నాటౌట్) రాణించారు. మలింగ రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పొలార్డ్ (33 నాటౌట్), చిదంబరం గౌతమ్ (22) మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు.