చెన్నై టార్గెట్ 174 పరుగులు | mumbai set target 174 runs to chennai | Sakshi
Sakshi News home page

చెన్నై టార్గెట్ 174 పరుగులు

Published Wed, May 28 2014 9:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

mumbai set target 174 runs to chennai

ముంబై: ఐపీఎల్-7లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై ఇండియన్స్ 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

ఓపెనర్ సిమన్స్ అర్థ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు.  మైక్ హస్సీ 39, ఆండర్సన్ 20, రోహిత్ శర్మ 20, పొలార్డ్ 14 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. నెహ్రా, జడేజా రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement