chennai supers kings
-
IPL 2022: ధోని అరుదైన రికార్డు.. రైనా, పొలార్డ్‌ను వెనక్కి నెట్టి
IPL 2022 CSK Vs MI- MS Dhoni Rare Record: ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్, మిస్టర్ ఫినిషర్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా వంద పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్న సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, కీరన్ పొలార్డ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో వరుస షాట్లు బాది ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో మొత్తంగా ఉనాద్కట్ బౌలింగ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ధోని 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు సురేశ్ రైనా సందీప్ శర్మ బౌలింగ్‌లో 47 బంతుల్లో, ఏబీ డివిల్లియర్స్ కూడా సందీప్ శర్మ బౌలింగ్‌లోనే 47 బంతుల్లో, కీరన్ పొలార్డ్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 47 బంతుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక ముంబైతో మ్యాచ్‌లో మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న ధోని 28 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతికి మిస్టర్ కూల్ ఫోర్ బాదడంతో 3 వికెట్ల తేడాతో జడ్డూ సేనను విజయం వరించింది. ఐపీఎల్లో ఒక ఆటగాడి బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన బ్యాటర్లు: ఎంఎస్ ధోని- 42 బంతుల్లో- జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో సురేశ్ రైనా- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్- 47 బంతుల్లో- రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చదవండి: CSK Vs MI: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే! Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టుగా..
IPL CSK Vs MI- Mumbai Indians Worst Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా తొలి ఏడు మ్యాచ్‌లు ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమితో ఈ అపఖ్యాతి మూటగట్టుకుంది. కాగా తాజా ఎడిషన్‌లో మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్.. తాజాగా సీఎస్కే చేతిలో ఓడిపోయింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఆరంభ ఏడు మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా ముంబై అపవాదును మూటగట్టుకుంది. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2013లో, ఆర్సీబీ 2019లో సీజన్ ఆరంభంలో మొదటి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైన జట్లుగా పేరొందాయి. ఇక ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన గురువారం నాటి(ఏప్రిల్ 21) మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు విజయం అందించాడు. దీంతో ముంబైకి మరోసారి పరాభవం తప్పలేదు. మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ స్కోర్లు: ముంబై- 155/7 (20) చెన్నై- 156/7 (20) చదవండి: IPL 2022: ధోని ఫినిషింగ్ టచ్.. ముంబై ‘ఏడు’పు..! Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Kevin Pietersen: ఈసారి ఆ జట్టే ఐపీఎల్ విజేత!
Kevin Pietersen On IPL 2021 Winner: క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత పై ఇప్పటి నుంచే మాజీలు, క్రికెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఆభిప్రాయాన్ని తెలిపాడు. ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉందని అతడు చెప్పాడు. ఐపీఎల్ 2020లో చెన్నై ఆటతీరు పూర్తిగా నిరాశపరచిందని.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా వారు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేదని పీటర్సన్ చెప్పాడు. అయితే ధోనీ నేతృత్వంలోని జట్టు ఈసారి ఐపీఎల్ ఫేజ్-1లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గురించి పీటర్సన్ మాట్లాడుతూ.. ముంబై ప్రతిసారి నెమ్మదిగానే టోర్నీని ప్రారంభిస్తుందని.. లీగ్ మధ్యలో ఆ జట్టు ఊపు అందకుంటుందని అభిప్రాయపడ్డాడు. లీగ్ మధ్యలో ఉంది కనుక ముంబై టైటిల్ రేసులో నిలవాలంటే వాళ్లు ఆడే ప్రతి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని అతడు సూచించాడు. మరోవైపు ప్రస్తుతం లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి -
సాక్షి, జీవాలతో డ్యాన్స్ చేసిన ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్ చేశాడు. కుటుంబంతో పాటు వేడుకకు హాజరైన సన్నిహితులతో కలిసి సెప్టులేస్తూ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. "ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదు" అని క్యాప్షన్ జతచేసింది. ఈ వీడియో ధోని అభిమానులు, నెటిజన్లను ఆకట్టకుంటోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఫ్రాంఛైజ్ క్రికెట్లో కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సీఎస్కేకు సారథ్యం వహిస్తునన్న ధోని.. 39 ఏళ్ల ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. కాగా ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. సీఎస్కే 2010, 2011, 2018 సీజన్లలో మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. 2020 వరకు ఆడిన ప్రతీ సీజన్లో దాదాపుగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కానీ 13వ సీజన్లోనే మొదటిసారిగా ప్లేఆఫ్ చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ధోని రిటైర్ అవుతాడంటూ ఊహాగానాలు వినిపించగా.. "పసుపు జెర్సీలో ఈ మ్యాచ్ మీ చివరిది కదా?" అని విలేకరులు అడిగినపప్పుడు "ఖచ్చితంగా కాదు" అని ధోనీ గట్టిగా స్పందించాడు. 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4632 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు(136.75 స్ట్రైక్ రేట్) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల స్థానంలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. Can we stop ourselves from smiling while watching this? Definitely Not. 😊 #WhistlePodu #Yellove @msdhoni @SaakshiSRawat 🦁💛 pic.twitter.com/cuD8x3J7oS — Chennai Super Kings (@ChennaiIPL) November 26, 2020 -
'సూపర్' విజయం కావాలి
చెన్నైని ఊరిస్తున్న మూడో టైటిల్ పటిష్టంగా ధోని సేన ఐపీఎల్లో అందరికంటే నిలకడగా రాణించిన జట్టు నిస్సందేహంగా చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీలో 60కి పైగా విజయశాతం ఉన్న ఏకైక టీమ్ ఇది. ఏడు టోర్నీలలో రెండు సార్లు విజేత, మూడు సార్లు రన్నరప్, మరో రెండు సార్లు కనీసం సెమీస్ దశ చేరిన ఘనత ధోని సేనదే. భారత జట్టులోని కీలక సభ్యుల అండతో సూపర్ కింగ్స్ పటిష్టంగా ఉంది. అయితే గత మూడు సీజన్లుగా ఆ జట్టు టైటిల్‌కు చేరువైనట్లే అనిపించి దూరమవుతోంది. వరుసగా రెండేళ్లు ఫైనల్లో ఓడిన టీమ్, మరోసారి సెమీస్‌లో వెనుదిరిగింది. బెట్టింగ్ వివాదాలతో ఒక దశలో ఈ సీజన్లో ఆడుతుందా లేదా అనే అనుమానాల మధ్య ఊగిసలాడిన చెన్నై ఎట్టకేలకు ఎలాంటి ప్రమాదం లేకుండా బరిలో నిలిచింది. మరి ఐపీఎల్-8లోనైనా జట్టు అదృష్టం మారుతుందా! సాక్షి క్రీడా విభాగం : చెన్నై విజయమంత్రం అంతా ఆ జట్టు కూర్పులోనే ఉంది. తొలి ఐపీఎల్‌నుంచి చూస్తే టీమ్‌లో ఒక్కసారిగా భారీ మార్పులు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ప్రతీ ఏటా ఒకటి రెండు మార్పులు, దేశవాళీ కుర్రాళ్లకు అనుభవం కోసం చోటు కల్పించడం తప్పిస్తే టీమ్ తుది జట్టును సులభంగా అంచనా వేయవచ్చు. దాంతో అభిమానులపరంగా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా సూపర్ కింగ్స్‌కు ప్రత్యేక ముద్ర, నమ్మకమైన ఫాలోయింగ్ ఉంది. భారత కెప్టెన్ ధోని ఆ జట్టుకు పెద్ద బ్రాండ్ ఇమేజ్. టీమ్‌లో రెగ్యులర్ ఆటగాళ్లుగా రైనా, అశ్విన్‌లకు తిరుగులేదు. 2008లో ఆ జట్టు ఫైనల్లో రాజస్థాన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అనంతరం దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో సెమీస్‌కు పరిమితమైంది. కానీ ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు ఐపీఎల్లో సూపర్ కింగ్స్ హవా కొనసాగింది. 2010లో 16 మ్యాచ్‌లలో 9 విజయాలతో ట్రోఫీ గెలుచుకున్న ఆ జట్టు 2011లో మరింత మెరుగ్గా ఆడి 11 విజయాలతో టైటిల్ నిలబెట్టుకుంది. అయితే మరో రెండేళ్లు మాత్రం ధోని సేనకు తుది మెట్టుపై భంగపాటు ఎదురైంది. 2012 ఫైనల్లో కోల్‌కతా చేతిలో ఓడిన ఈ జట్టు, మరుసటి ఏడాది తుది పోరులో ముంబైకి తలవంచింది. ప్లేఆఫ్‌తో ముగింపు... 2014లో వేలంకు ముందే ధోని, రైనా, జడేజా, అశ్విన్, బ్రేవోలను అట్టి పెట్టుకున్న చెన్నై...వేలంలో బ్రెండన్ మెకల్లమ్, డు ప్లెసిస్, డ్వేన్ స్మిత్‌లను తీసుకుంది. టోర్నీ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలు సాధించి జట్టు అద్భుతమైన ఫామ్‌లో కనిపించింది. అయితే ఆ తర్వాత కాస్త తడబడి వరుస పరాజయాలు ఎదుర్కొంది. చివరకు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో ముంబైని ఓడించిన ఆ జట్టు, రెండో క్వాలిఫయర్‌లో మాత్రం పంజాబ్ చేతిలో పరాజయం పాలైంది. మార్పులు చేర్పులు గతంలో తమ జట్టుకే ఆడిన మైక్ హస్సీని ఈ సారి చెన్నై మళ్లీ సొంతం చేసుకుంది. హస్సీ లేదా స్మిత్‌లలో ఒకరు ఓపెనర్‌గా ఆడవచ్చు. గతేడాది మెకల్లమ్ 405 పరుగులు చేసినా అతని స్థాయిని బట్టి చూస్తే తగిన స్ట్రైక్ రేట్ (121.62)తో ఆడలేదు. అయితే ప్రపంచకప్‌లో మెకల్లమ్ ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సారి చెన్నై మెకల్లమ్నుంచి భారీగానే ఆశిస్తోంది. గత ఏడాది జట్టు ప్రధాన పేసర్లు ఓవర్‌కు 8కి పైగా పరుగులిచ్చి నిరాశపరిచారు. ఈ సారి కొత్తగా చెన్నై రూ. 30 లక్షలతో దక్షిణాఫ్రికా పేసర్ కైల్ అబాట్‌ను తీసుకుంది. ప్రపంచకప్‌లోనూ రాణించిన అతనికి ఈ ఫార్మాట్లో తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తాడనే రికార్డు ఉంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ సారి చెన్నైతో చేరాడు. కీలక ఆటగాళ్లు: ఐపీఎల్లో చెన్నై ఆడిన 115 మ్యాచ్‌లలోనూ ఆడిన ఆటగాడు రైనా. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల (3325) రికార్డు అతనిదే. మూడో స్థానంలో రైనా మెరుపులు ప్రతీసారి చెన్నై ఫలితాన్ని శాసిస్తున్నాయి. ఇక వరల్డ్ కప్‌లో లేని డ్వేన్ బ్రేవో పూర్తి ఫిట్‌గా బరిలోకి దిగుతున్నాడు. గత ఏడాది బౌలర్‌గా అద్భుతంగా రాణించిన జడేజా ఈ సారి బ్యాట్స్‌మన్‌గా కూడా సత్తా చాటాల్సి ఉంది. ధోని, డుప్లెసిస్లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉండగా, ఐపీఎల్లో అశ్విన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు ఎప్పుడైనా కష్టమే. -
బదులు తీర్చుకున్న ధోని సేన
ముంబై: గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ బదులు తీర్చుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ తో పోరుకు ధోని సేన సిద్దమయింది. ముంబై నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 8 బంతులు మిగులుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సురేష్ రైనా అర్థ సెంచరీతో రాణించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. డేవిడ్ హస్సీ 40, ప్లెసిస్ 35, డ్వేన్ స్మిత్ 24 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఓజాకు ఒక వికెట్ దక్కింది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుంది. రైనా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
చెన్నై టార్గెట్ 174 పరుగులు
ముంబై: ఐపీఎల్-7లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై ఇండియన్స్ 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ సిమన్స్ అర్థ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. మైక్ హస్సీ 39, ఆండర్సన్ 20, రోహిత్ శర్మ 20, పొలార్డ్ 14 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. నెహ్రా, జడేజా రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.