Simmons
-
బఫెట్ సంపద రహస్యం అదే
జెండరీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ జిమ్ సిమన్స్ సంపద విలువ 31.4 బిలియన్ డాలర్లు. విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నెట్‌వర్త్ 139 బిలియన్ డాలర్లు. బఫెట్ కంటే సిమన్స్ సంపద 77 శాతం తక్కువ. వీరిద్దరి మధ్యనున్న సూక్ష్మ వైరుధ్యాన్ని ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాలి. జిమ్ సిమన్స్ స్థాపించిన హెడ్జ్ ఫండ్ ‘రెనైసెన్స్ టెక్నాలజీస్’ ఒకటి రెండేళ్లు కాదు.. 1988 నుంచి ఏటా 66 శాతం చొప్పున, నిరంతరాయంగా మూడు దశాబ్దాలకు పైనే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచి్చపెట్టింది. అదే వారెన్ బఫెట్ స్థాపించిన బెర్క్‌షేర్ హాథవే ఏటా 19.8 శాతం కాంపౌండింగ్ వృద్ధినే నమోదు చేసింది. సిమన్స్ కంటే బఫెట్ సంపదే నాలుగు రెట్లు అధికం. ఏటా ఎంత అధికంగా రాబడి తెచ్చుకున్నారనే దానికంటే.. ఎంత ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టారు, వాటిని ఎంత కాలం పాటు కొనసాగించారు? అన్నవే సంపదను నిర్ణయిస్తాయని సిమన్స్–బఫెట్ జర్నీ చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఆరంభించి, దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని గరిష్టంగా అందుకోగలరు. ఏటా 12 శాతం రాబడి సంపద సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. సంపాదనను తీసుకెళ్లి వృద్ధి చెందే చోట పెట్టడం. ఎంత ముందుగా ఆరంభిస్తే, దీర్ఘకాలంలో అంత అధికంగా ప్రయోజనం పొందొచ్చు. బఫెట్ పెట్టుబడుల ప్రయాణాన్ని గమనించినా ఇదే బోధపడుతుంది. ముందుగా మొదలు పెట్టడం వల్ల అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం గరిష్ట స్థాయిలో పొందడానికి కావాల్సినంత వ్యవధి ఉంటుంది. 25 ఏళ్ల మహిమ ప్రతి నెలా రూ.1,000 చొప్పున తనకు 50 ఏళ్లు వచ్చే వరకు.. అంటే 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసిందని అనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో మహిమ అసలు పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీలలో దీర్ఘకాల సగటు) అంచనా ప్రకారం సమకూరే మొత్తం రూ.18 లక్షలు. కేవలం వెయ్యి రూపాయలే.. 25 ఏళ్లలో రూ.18 లక్షలుగా మారడం కాంపౌండింగ్ వల్లే. ఇలా కాకుండా మహిమ కేసులో కాంపౌండింగ్ ప్రయోజనం తీసేసి చూస్తే.. అంటే అసలుతోపాటు, దానిపై వచి్చన వడ్డీని ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే సమకూరే మొత్తం రూ.7.5 లక్షలుగానే ఉండేది. మొత్తం రూ.18 లక్షల్లో మిగిలిన రూ.10.5 లక్షలు కేవలం కాంపౌండింగ్ వల్లే సమకూరినట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడికి ఇప్పుడేం తొందరొచి్చందిలే.. తర్వాత చూద్దామనుకుని, మహిమ పదేళ్లు ఆలస్యంగా తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి ఉంటే ఏమయ్యేది? పైన చెప్పుకున్నట్టు 50 ఏళ్ల వయసుకు రూ.18 లక్షలు రావాలంటే అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెలా ఆమె రూ.1,700 ఇన్వెస్ట్ చేయాల్సిందే. పదేళ్లు వృధా చేయడం వల్ల 70 శాతం అదనపు పెట్టుబడి అవసరం అవుతుందని ఇక్కడి ఉదాహరణ చెబుతోంది. పెట్టుబడి విషయంలో కాలం వృధా అవుతున్న కొద్దీ కాంపౌండింగ్ ప్రయోజనం అదే స్థాయిలో కోల్పోతారు. కాంపౌండింగ్పెట్టుబడిపై వడ్డీ వస్తుందని తెలుసు. దీన్ని వడ్డీ రాబడిగా చెబుతారు. ఈ వడ్డీ కూడా తిరిగి పెట్టుబడిగా మారి దానిపైనా వడ్డీ సమకూరడమే కాంపౌండింగ్. దీన్నే చక్రవడ్డీ అని కూడా చెబుతారు. బ్యాంకులో వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం తీసుకున్నప్పుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఒక నెల ఈఎంఐ చెల్లించడంలో విఫలమై, మరుసటి నెలలో చెల్లిస్తున్నప్పుడు నెల బకాయిపై వడ్డీని కూడా బ్యాంక్ రాబడుతుంది. దీన్నే వడ్డీ మీద వడ్డీగా చెబుతారు. రూ.100 ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం రాబడి ప్రకారం ఏడాది తర్వాత రూ.110గా మారుతుంది. ఇందులో రూ.10 వడ్డీ రూపంలో సమకూరింది. రెండో ఏడాది రూ.110 కాస్తా రూ.121గా మారుతుంది. మొదటి ఏడాది వడ్డీ రూ.10పైనా రెండో ఏడాది రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇలా వడ్డీపై వడ్డీ రాబడి జమవుతుంది కనుకనే దీర్ఘకాలంలో భారీ మొత్తం సమకూరుతుంది. పెట్టుబడుల జర్నీ..బఫెట్ ప్రస్తుత వయసు 90 ఏళ్లు. ఆయన సంపద విలువ 139 బిలియన్ డాలర్లు. నిజానికి బఫెట్ సంపదలో 99 శాతం ఆయనకు 65 ఏళ్లు వచి్చన తర్వాత సమకూరిందేనని ప్రముఖ రచయిత మోర్గాన్ హౌసెల్ ‘ద సైకాలజీ ఆఫ్ మనీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒకవేళ బఫెట్ 65 ఏళ్లకే రిటైర్ అయి ఉంటే నేడు ఆయన గురించి అంతగా మాట్లాడుకునే వాళ్లం కాదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా హౌసెల్ పేర్కొన్నారు. బఫెట్ 30 ఏళ్ల వయసులో పెట్టుబడులు మొదలు పెట్టి, 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకున్నాడన్నది చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిన విషయం. కానీ, నిజానికి బఫెట్ 10 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ఆరంభించారు. 30 ఏళ్ల నాటికి ఆయన 9.3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. వెనక్కి తీసుకోకుండా అలాగే జీవితకాలం పాటు కొనసాగించారు. సంపాదిస్తున్న మొత్తంలో కనీస అవసరాలకే తప్ప ఎప్పుడూ లగ్జరీ వ్యయాలకు పోలేదు. వీలైనంత పెట్టుబడి పెట్టడమే ఆయన చేసిన పని. నిజానికి దీన్నే బఫెట్ స్కిల్ (నైపుణ్యం)గా హౌసెల్ అభివర్ణిస్తారు. ఏటా 20 శాతం చొప్పున బఫెట్ సంపద కాంపౌండ్ అయింది. జిమ్ సిమన్స్ 1988 నుంచి పెట్టుబడులు ఏటా 66 శాతం చొప్పున వృద్ధి చెందేంత గొప్ప వ్యూహాలు అమలు చేసిననప్పటికీ.. తక్కువ సంపద కలిగి ఉండడానికి కారణం పెట్టుబడుల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే. నిజానికి సిమన్స్ వార్షిక రాబడి 66 శాతంలో బఫెట్ వార్షిక రాబడి మూడింట ఒక వంతే. బఫెట్ ఎంతో ముందుగా మొదలు పెట్టడం వల్ల కాంపౌండింతో ఎక్కువ సంపద సమకూరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కానంత వార్షిక రాబడులను సిమన్స్ తెచ్చుకున్నా కానీ, ఆస్తుల్లో బఫెట్ కంటే దిగువన ఉండడానికి కారణం 50 ఏళ్లు వచి్చన తర్వాతే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆరంభించడం. అందుకే ప్రతి ఇన్వెస్టర్ ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టి, ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఆచరించాలని బఫెట్ విజయ గాధ తెలియజేస్తోంది. బఫెట్ మాదిరే సిమన్స్ కూడా 70 ఏళ్లపాటు ఏటా 66 శాతం చొప్పున రాబడులు తెచ్చుకుని ఉంటే.. ఆ మొత్తం కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది. బఫెట్ పంచ సూత్రాలు ⇥ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి. ⇥ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్‌లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి. ⇥ పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది. ⇥ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి. ⇥ ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్‌కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది. జిమ్ సిమన్స్ ఏమి చెప్పారంటే..?⇥ ఒక గొప్ప సిద్ధాంతం అందంగా ఎలా ఉంటుందో.. గొప్పగా, సమర్థవంతంగా పనిచేసే కంపెనీ కూడా అంతే అందంగా ఉంటుంది. ⇥ వీలైనంత వరకు మీ చుట్టూ తెలివైన, ఉత్తమమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. వారు మీకంటే తెలివైన వారు అయితే ఇంకా మంచిది. ⇥ ఏదో ఒకటి వాస్తవికంగా చేయండి. మిగిలిన వారిని అనుసరించొద్దు. ఒకే సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ప్రయతి్నస్తుంటే మీరు దాన్ని చేయొద్దు. ⇥ అంత సులభంగా వదిలేసుకోవద్దు. దానికే కట్టుబడి ఉండాలి. అలా అని శాశ్వతంగా కాదు. కానీ, ఫలితమిచ్చేంత సమయం దానికి ఇవ్వాలి. ⇥ చివరిగా అదృష్టం కలసిరావాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ⇥ జేమ్స్ హారిస్ సిమన్స్ (జిమ్ సిమన్స్) గణితంలో దిట్ట. తనకున్న అసాధారణ ప్రతిభతో మార్కెట్ల తీరును కచి్చతంగా అంచనా వేసి, పెట్టుబడులపై అధిక ప్రతిఫలం పొందే దిశగా ఆయన అమలు చేసిన విధానాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. 1980లోనే క్వాంట్ ఇన్వెస్టింగ్ విధానాన్ని ఆవిష్కరించి బఫెట్, జార్జ్ సోరోస్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లను అధిగమించారు. -
చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!
సాక్షి, గుంటూరు: 371 కోట్ల రూపాయలు లూటీ చేసిన స్కిల్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కాం ఆద్యంతం అబద్ధాలతో ముందుకు తీసుకెళ్లారాయన. సాక్ష్యాలతో దొరికినా సిఐడీ అధికారులకు అబద్ధాలే చెప్పారాయన. న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే..ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు అబద్ధాలపై అబద్ధలు పేర్చుకుపోయారు. బాబు ఆరోగ్యంపైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనకు మాయరోగాలన్నీ అంటించారు. ఇన్ని అబద్ధాలతో కోట కట్టేసి ఇపుడు నిజం గెలవాలని భువనేశ్వరి చేత యాత్ర చేయిస్తున్నారు. నిజం గెలవాలంటున్నారు నారా భువనేశ్వరి. నిజమే నిజమే గెలవాలి. అబద్ధం ఎప్పుడూ గెలవకూడనే కూడదు. కాకపోతే దురదృష్ట వశాత్తూ అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా నెట్టుకొచ్చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడికి నిజానికి అసలు సంబంధంమే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నేతలు. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమాంతం భోంచేసిన అతి పెద్ద అవినీతి ఘట్టంలో చంద్రబాబు నాయుడి పాత్రకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం భావించింది కాబట్టే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ► నిజానికి స్కిల్ వ్యవహారంలో సిమన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్ ను నమ్మించారు. అది అబద్ధం ► మనం 10 శాతం నిధులు పెడితే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందని మంత్రివర్గాన్ని నమ్మించారు. అది అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అది అబద్ధం ► సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుముందు హాజరు పరిస్తే తనను 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని ఫిర్యాదు చేశారు. అది అబద్ధం ► 48 రోజులకు పైగా జైల్లో ఉండి..ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతున్నారు. అది అబద్ధం ► చంద్రబాబు నాయుణ్ని ములాఖత్ లో కలిసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి నా భర్త జైలుకెళ్లాక అయిదు కిలోల బరువు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అది అబద్ధం ఆయన ఒక కిలో బరువు పెరిగారన్నది నిజం. ► జైల్లో సరఫరా అవుతోన్న నీళ్లు కలుషితంగా ఉన్నాయని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం ► తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అది అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. అది అబద్ధం ► తన భర్త కు సరియైన భద్రత లేదని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం. అత్యంత పటిష్ఠమైన భద్రతను చంద్రబాబుకు ఏర్పాటు చేశారన్నది నిజం. ► ఇపుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు . అది అబద్ధం. చంద్రబాబుకు జైలును మించిన సురక్షితమైన చోటు మరోటి లేదని వారు అంటున్నారు. ► అసలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది అబద్ధం. 371 కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయో.. ఎలా షెల్ కంపెనీలు దాటుకుంటూ హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడికి అవి చేరాయో ఈడీ అధికారులు మొత్తం రూట్ ని కనిపెట్టారు. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. హవాలా మార్గంలో చంద్రబాబుకు నిధులు సేకరించిన బాబు పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లతో పాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన మనోజ్ పార్ధసానికి సిఐడీ నోటీసులు ఇవ్వడంతోనే వారు పరారయ్యారు. కిలారు రాజేష్ అయితే నెల రోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అమాంతం సిఐడీ ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏం అడిగినా తెలీదు గుర్తులేదు అని దాటవేశారు. రెండో రోజు విచారణకు వచ్చేటపుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావలసిందిగా సిఐడీ అధికారులు ఆదేశించారు. అంతే తాను విచారణకు రాలేనని ఆ డాక్యుమెంట్లు తీసుకురాడానికి కొంత సమయం పడుతుందని దసరా తర్వాత తిరిగి విచారణకు హాజరవుతానని చెప్పి రాజేష్ మాయమయ్యాడు. పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆయన ఎందుకు పారిపోయాడో మాత్రం సిఐడీ అధికారులకు తెలుసు. అతగాణ్ని విచారిస్తే షెల్ కంపెనీల ద్వారా తలరించిన 241 కోట్ల రూపాయల నిధులు ఏయే ఖాతాల్లో జమ చేశారో తెలుస్తుంది. ఆ భయానికే చంద్రబాబు నాయుడే శ్రీనివాస్ ను దేశంలో లేకుండా బయటకు పంపేశారని సిఐడీ అనుమానిస్తోంది. స్కిల్ స్కాం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడి అపకీర్తి కిరీటంలో ఎన్నో అవినీతి రాళ్లు పొదిగి ఉన్నాయి. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం వంటివి క్యూలో నిలబడ్డాయి. చంద్రబాబును ఎప్పుడు విచారిద్దామా అని దర్యాప్తు సంస్థలు కాచుక్కూర్చున్నాయి. వీటిలోనే కొన్నింటికి పీటీ వారంట్లు జారీ చేసింది అందుకే. న్యాయస్థానాల అనుమతి రాగానే ఒకటొకటిగా పాపాలు బద్దలు అవుతాయి. అబద్ధాల పుట్టలు పేలిపోతాయి...అని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు. అన్ని కేసుల్లోనూ స్కిల్ స్కాం తరహాలోనే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయి పెద్ద కోట కట్టేశారు. ఆ కోటకు ఇంతకాలానికి బీటలు వారాయి. ఇక అది కుప్పకూలడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. బెయిల్ ఎంతకీ రాకపోయే సరికి చంద్రబాబుకు ఆ రోగం ఉంది ఈ సమస్య ఉంది అని రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరకు 73 ఏళ్ల వయసున్న నేతని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడికన్నా వయసులో చాలా పెద్ద వారు అయిన నేతలు మాజీ ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్న సంగతిని టిడిపి నేతలు కానీ..భువనేశ్వరి అండ్ కో కానీ తెలివిగా విస్మరిస్తున్నారు. అబద్ధాల చంద్రబాబును కాపాడుకోడానికి భువనేశ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా నిజం గెలిచి తీరుతుందని.. అపుడు చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండక తప్పదని పాలక పక్ష నేతలు అంటున్నారు. -
సిమన్స్ ఊచకోత.. నైట్ రైడర్స్ ఘన విజయం
సెంట్కిట్స్: కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన తల్లావాస్ మొదటి ఆరు ఓవర్లలో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్లోస్ బ్రాత్‌వైట్..ఇమాడ్ వసీంతో కలిసి ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. బ్రాత్‌వైట్ (58, 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా, ఇమాడ్ వసీం (42, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 145 పరుగుల లక్ష్యన్ని నైట్ రైడర్స్ ముందు ఉంచింది. నైట్ రైడర్స్ బౌలర్లలో అకేల్ హోసిన్, రవి రాంపాల్ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, నరైన్ ,ఉదానా ఒక్కో వికెట్ సాధించారు. ఆనంతరం 145 లక్ష్య సాదనతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలోనే సునీల్ నరైన్ వికెట్ కోల్పోయింది. అయితే అసలు ఊచకోత తర్వాత మెదలైంది. ప్రత్యర్ధి బౌలర్లపై లెండెల్ సిమన్స్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 70 (5 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. కొలిన్ మున్రోతో (34) కలిసి 102 పరుగుల బాగాస్వామ్యన్ని సిమన్స్ నమోదు చేశాడు. చివరకు సిమన్స్ ను అవుట్ చేసిన ప్రిటోరియస్ .. ఈ బాగాస్వామ్యన్ని విడదీశాడు. అరంతరం క్రీజులోకి వచ్చిన డారన్ బ్రావో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 145 పరుగుల లక్ష్యన్ని సునాయాసంగా చేధించింది. చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు THREE catches and a SEVENTY with the bat sees Lendl Simmons pick up the @Dream11 MVP for match 18. #CPL21 #TKRvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/zk3Lm1ETIB — CPL T20 (@CPL) September 5, 2021 -
పుణే ఫటాఫట్
► 9 వికెట్లతో ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం ► తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ► సమష్టిగా రాణించిన ధోని బృందం అదరగొట్టిన అజింక్య రహానే కొత్త ఆశలతో... కొంగొత్త ఆశయాలతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఐపీఎల్-9 సీజన్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ... టి20 స్టార్లు, తలపండిన అనుభవజ్ఞులతో కూడిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో ధోని సేన 9 వికెట్లతో రోహిత్ బృందంపై నెగ్గి శుభారంభం చేసింది. ముంబై: భారీ హిట్టర్లతో కూడిన ముంబై ఇండియన్స్‌ను... రైజింగ్ పుణే రఫ్ఫాడించింది. బంతితో నిప్పులు చెరుగుతూ స్టార్ బలగాన్ని ఓ మాదిరి స్కోరుకే కట్టిపడేసింది. దీంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోని బృందం 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు చేసింది. హర్భజన్ (30 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), అంబటి తిరుపతి రాయుడు (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అజింక్య రహానే (42 బంతుల్లో 66 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. డు ప్లెసిస్ (33 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు. చకచకా వికెట్లు.... ఆరంభం నుంచే పుణే బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో ముంబై చకచకా వికెట్లు కోల్పోయింది. అడపాదడపా ఫోర్లు బాదినా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. రెండో ఓవర్లో రోహిత్ శర్మ (7), నాలుగో ఓవర్లో సిమన్స్ (8) అవుట్‌కాగా, ఐదో ఓవర్లో మార్ష్.... హార్దిక్ (9), బట్లర్ (0)లను పెవిలియన్‌కు పంపి షాకిచ్చాడు. పవర్‌ప్లేలో 4 వికెట్లకు 37 పరుగులు చేసిన ముంబైని మ్యాచ్ మధ్యలోనూ రజత్ భాటియా, మురుగన్ అశ్విన్‌లు కుదురుగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. క్రీజులో పాతుకుపోయిన రాయుడు సింగిల్స్‌కు పరిమితమైతే... రెండో ఎండ్‌లో భారీ హిట్టర్ పొలార్డ్ (1), గోపాల్ (2)లను అవుట్ చేయడంతో రన్‌రేట్ పడిపోయింది. 16వ ఓవర్లో రాయుడు అవుటైన తర్వాత హర్భజన్ ఎదురుదాడి మొదలుపెట్టాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో చివరి మూడు ఓవర్లలో 41 పరుగులు రాబట్టడంతో ముంబై స్కోరు 120 పరుగులు దాటగలిగింది. పుణే బౌలర్లలో ఇషాంత్, మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు. రహానే అదుర్స్... తొలి బంతి నుంచే దూకుడు చూపెట్టిన ఓపెనర్లు రహానే, డు ప్లెసిస్‌లు శుభారంభాన్నిచ్చారు. తొలి నాలుగు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదిన ఈ జోడి... ఐదో ఓవర్లో మాత్రం చెరో సిక్సర్ కొట్టింది. బుమ్రా వేసిన ఆరో ఓవర్లో డు ప్లెసిస్ మరో రెండు సిక్సర్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 57/0కు చేరుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించినా.. ఏ దశలోనూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 78 పరుగులు జోడించాక డు ప్లెసిస్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన పీటర్సన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్సర్లు) హర్భజన్ వేసిన వరుస ఓవర్లలో లాంగాన్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక 36 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో అజింక్య రహానే రెండు సిక్సర్లు సాధించాడు. దాంతో 32 బంతులు మిగిలి ఉండగానే పుణేకు విజయం దక్కింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) ఇషాంత్ 8; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 7, హార్దిక్ పాండ్యా (సి) ధోని (బి) మార్ష్ 9; బట్లర్ (సి) ఆర్.అశ్విన్ (బి) మార్ష్ 0; రాయుడు (సి) డు ప్లెసిస్ (బి) ఆర్.అశ్విన్ 22; పొలార్డ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 1; గోపాల్ (సి) రహానే (బి) ఎం.అశ్విన్ 2; హర్భజన్ నాటౌట్ 45; వినయ్ (సి) స్మిత్ (బి) ఆర్పీ సింగ్ 12; మెక్లీంగన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1-8; 2-29; 3-29; 4-30; 5-40; 6-51; 7-68, 8-96. బౌలింగ్: ఆర్పీ సింగ్ 3-0-30-1; ఇషాంత్ శర్మ 4-0-36-2; మిషెల్ మార్ష్ 4-0-21-2; రజత్ భాటియా 4-1-10-1; మురుగన్ అశ్విన్ 4-0-16-1; రవిచంద్రన్ అశ్విన్ 1-0-7-1. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 66; డు ప్లెసిస్ (బి) హర్భజన్ 34; పీటర్సన్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (14.4 ఓవర్లలో 1 వికెట్‌కు) 126. వికెట్ల పతనం: 1-78. బౌలింగ్: మెక్లీంగన్ 3-0-27-0; బుమ్రా 3-0-30-0; వినయ్ కుమార్ 2-0-14-0; గోపాల్ 3-0-18-0; హర్భజన్ 3-0-24-1; హార్దిక్ పాండ్యా 0.4-0-12-0. ► 1 ముంబై ఇండియన్స్ జట్టులో టాప్-4 బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయకుండా అవుటవ్వడం ఇదే ప్రథమం. ► 1 ఈ మ్యాచ్‌లో పుణే జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు (ఇషాంత్, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, అశ్విన్) ఇన్నింగ్స్‌లో తాము వేసిన తొలి బంతికే వికెట్‌ను తీశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ► 300 ఈ మ్యాచ్‌తో కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) తన కెరీర్లో 300వ టి20 మ్యాచ్‌ను ఆడాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పొలార్డ్ గుర్తింపు పొందాడు. ఇదే మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ 100వ టి20 మ్యాచ్‌ను... వినయ్ కుమార్ 100వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడారు. ► ఇంతకంటే మంచి ఆరంభం లభిస్తుందని అనుకోను. ఈ ఘనత బౌలర్లకే చెందుతుంది. పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్థులు కూడా బాగానే పోరాడారు. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. వికెట్ ఎలా ఉన్నా... రహానే అద్భుతంగా ఆడతాడు. ఫినిషింగ్ కూడా బాగుంది. - ధోని (పుణే కెప్టెన్) -
వరస కడుతున్న విదేశీ కంపెనీలు
♦ ప్రీమియం ఉత్పత్తులతో ఎంట్రీ ♦ గట్టిపోటీనిస్తున్న దేశీ బ్రాండ్లు ♦ రూ.7 వేల కోట్లకు పరుపుల పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెర్టా, కింగ్ కోయిల్, ఎక్లిప్స్, స్ప్రింగ్ ఎయిర్, సిమ్మన్స్... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? విదేశీ ‘పరుపుల’ బ్రాండ్లు. పెరుగుతున్న టూరిజానికి తగ్గట్టుగా హోటళ్లు, రిసార్ట్‌లతో ఆతిథ్య రంగం మంచి జోష్‌మీద ఉండటం, ఇళ్లలోనూ ఖరీదైన పరుపుల వాడకం పెరుగుతుండటంతో దేశంలో అవకాశాల్ని అందిపుచ్చుకోవటానికి ఈ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకూ ఇక్కడి డీలర్లు నేరుగా విదేశాల నుంచి పరుపులను తెప్పించి విక్రయించేవారు. అయితే దిగుమతి పన్నులు ముడిపడి ఉండడంతో ఉత్పత్తులు ఖరీదు కావటం... డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో నేరుగా విదేశీ కంపెనీలే ఇండియాలో తయారీకి సై అంటున్నాయి. బెడ్డింగ్ సొల్యూషన్స్‌లో ఈ విదేశీ బ్రాండ్లకు దేశీ దిగ్గజాలు కర్లాన్, సెంచురీ, డ్యూరోఫ్లెక్స్, స్లీప్‌వెల్, గోద్రెజ్ ఇంటీరియో, స్ప్రింగ్ ఫిట్, పెప్స్, నీల్కమల్ వంటివి గట్టి పోటీనిస్తున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి: అంతర్జాతీయ కంపెనీల్లో 100 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. విక్రయాల పరంగా ప్రపంచ నంబర్ 1 కంపెనీ తమదేనని సీలీ చెబుతోంది. అట్లాంటాకు చెందిన సిమ్మన్స్ బెడ్డింగ్ కంపెనీకి 250 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. కంపెనీ 140 ఏళ్లకుపైగా ఈ రంగంలో ఉంది. 110 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కింగ్ కాయిల్ 80 దేశాల్లో అడుగు పెట్టింది. స్ప్రింగ్ ఎయిర్ ప్రపంచ టాప్-10 కంపెనీల్లో ఒకటి. సీలీ భారత్‌లో అత్యంత ఖరీదైన పరుపులను అమ్ముతోంది. సీలీ పరుపుల ధరలు భారతీయ రేంజ్లో రూ. 45,000 నుంచి రూ.1.2 లక్షల వరకు ఉన్నాయి. అంతర్జాతీయ రేంజ్లో రూ.లక్ష నుంచి రూ.11.5 లక్షల వరకు ఉన్నాయి. ఇక్కడి మార్కెట్ కోసమే ఇండియన్ రేంజ్‌ను ప్రవేశపెట్టడం విశేషం. హైదరాబాద్‌లో రూ.3 లక్షలు ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం పరుపులు అన్ని బ్రాండ్లవీ కలిపి నెలకు 10-12 యూనిట్లు అమ్ముడవుతున్నాయని సీలీ గ్యాలరీ ప్రమోటర్ శ్రీనివాసరావు తెలిపారు. పోటీ పెరగటంతో నిలకడగా ధర... గత రెండేళ్లుగా దేశీయ బ్రాండ్ల పరుపుల ధర పెరగలేదని రిపోస్ చెబుతోంది. మార్కెట్లో తీవ్రపోటీ ఉందని, విదేశీ దిగ్గజాలు కూడా నేరుగా మార్కెట్లోకి అడుగు పెడతున్నాయని తెలియజేసింది. పరుపుల ధర పెంచాల్సి వస్తే కంపెనీలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయని ఒక డీలర్ వెల్లడించారు. విదేశీ బ్రాండ్ల ఉత్పత్తుల ధర ఏటా 10 శాతం పెరుగుతోందని మరో డీలర్ తెలిపారు. భారత్‌లో పరుపుల మార్కెట్ విలువ సుమారు రూ.7,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఇందులో 15 శాతం వృద్ధి రేటుతో వ్యవస్థీకృత రంగం మూడింట ఒకవంతు కైవసం చేసుకుంది. మెట్రో నగరాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎక్స్‌క్లూజివ్ షోరూంలు, డీలర్ నెట్‌వర్క్‌తో కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీల ఉత్పత్తులు ఆన్లైన్లో లభిస్తున్నాయి. ఉత్పత్తులూ ప్రత్యేకమే.. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. నాణ్యమైన పరుపులను వాడాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు ప్రత్యేకతను చూపేందుకు నేచురల్ ప్రోడక్ట్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. అలోవెరా తాపడంతో యాక్సెసరీస్‌ను రిపోస్ మ్యాట్రెస్ తయారు చేస్తోంది. వెదురు, సహజ రబ్బరు, ఆర్గానిక్ కాటన్‌తోనూ ఉత్పత్తి చేస్తున్నట్టు రిపోస్ మ్యాట్రెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వి.బాలాజీ చెప్పారు. భారత్‌లో తొలిసారిగా సోయా రసంతోనూ యాక్సెసరీస్ రూపొందించినట్లు తెలియజేశారు. కింగ్ కాయిల్ సైతం సహజ సిద్ధ రబ్బరు, ముడి పదార్థాలతో పరుపులను తయారు చేస్తోంది. ఎక్లిప్స్ ఒక అడుగు ముందుకేసి పేటెంట్ కలిగిన అలర్జీ ఫ్రీ పరుపులను విక్రయిస్తోంది. పరుపుల తయారీలో భారత్‌లో అతిపెద్ద కంపెనీ అయిన కర్లాన్ ఆదాయంలో రూ.లక్షకు మించి ఖరీదున్న సూపర్ ప్రీమియం ఉత్పత్తుల వాటా 10 శాతానికి పైగా ఉంది. రెండేళ్ల క్రితం ఇది 5 శాతానికే పరిమితం. దీన్నిబట్టి ఇక్కడి మార్కెట్ పెరుగుతున్న వేగం అర్థం చేసుకోవచ్చు. అన్ని కంపెనీలు కస్టమర్లు కోరిన రంగులు, సైజుల్లో పరుపులను తయారు చేసి ఇస్తున్నాయి. -
చెన్నై టార్గెట్ 174 పరుగులు
ముంబై: ఐపీఎల్-7లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై ఇండియన్స్ 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ సిమన్స్ అర్థ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. మైక్ హస్సీ 39, ఆండర్సన్ 20, రోహిత్ శర్మ 20, పొలార్డ్ 14 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. నెహ్రా, జడేజా రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.