ముంబై: ఐపీఎల్ -7లో ప్లేఆప్ కు చేరుకునే చివరి జట్టు ఏదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్లే ఆప్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు వాంఖేడ్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థికి ముందు బ్యాటింగ్ అప్పగించాడు. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆప్ కు వెళుతుంది.
అయితే రోహిత్ సేన ప్లే ఆప్ లో అడుగు పెట్టాలంటే భారీ రన్ రేట్ తో మ్యాచ్ నెగ్గాలి. కీలక మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాజస్థాన్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. బిన్నీ స్థానంలో అభిషేక్ నాయర్, విక్రం మాలిక్ ప్లేస్ లో ధావల్ కులకుర్ణి, రాహుల్ తెవాటియా స్థానంలో అంకిత్ శర్మను జట్టులోకి వచ్చారు. ఇక ముంబై టీమ్ లో మర్చంట్ డీ లాంగె స్థానంలో కోవె ఆండర్సర్ ను తీసుకున్నారు.
తుది పోరుకు వెళ్లేదెవరో?
Published Sun, May 25 2014 8:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement