ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కోల్కత నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నైసూపర్ కింగ్స్ 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోల్కతా: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కోల్కత నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నైసూపర్ కింగ్స్ 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది.
ఓపెనర్ డ్వెన్ స్మిత్ 5 పరుగులకు వెనుదిరగగా, సురేష్ రైనా మరో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్తో కలసి జట్టును ఆదుకున్నాడు. మెకల్లమ్ (28) అవుటయ్యాక.. రైనాకు డుప్లెసిస్ (23) కాసేపు అండగా నిలిచాడు. ఈ క్రమంలో రైనా (65) హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో చెన్నై 122/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, రైనా, డుప్లెసిస్ వెంటవెంటనే అవుటయ్యారు. చివర్లో ధోనీ, జడేజా స్కోరు 150 దాటించారు. కమిన్స్, నరైన్, చావ్లా తలా వికెట్ తీశారు.