హౌస్‌ఫుల్... | IPL -7 house ful crowd in Uppal stadium | Sakshi
Sakshi News home page

హౌస్‌ఫుల్...

Published Mon, May 19 2014 12:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

IPL -7 house ful crowd in Uppal stadium

ఐపీఎల్-7లో హైదరాబాద్‌కు దక్కిన నాలుగు మ్యాచుల్లో ఆదివారం వచ్చిన ఏకైక మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికే చాలా వరకు స్టేడియంలో జనం ఉండగా, ఆ తర్వాత కొద్ది సేపటికే సీట్లు ఫుల్ అయిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం మ్యాచ్‌కు 28,584 మంది ప్రేక్షకులు వచ్చారు.
 
   స్టేడియంలో వేర్వేరు కారణాలతో అనుమతించని గ్యాలరీలు మినహా మిగతా స్టేడియం పూర్తిగా అభిమానులతో నిండింది. మధ్యాహ్నం సమయంలో నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురవడంతో ఉప్పల్‌లో కూడా అలాంటి పరిస్థితి రావచ్చని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఎలాంటి వర్షం ప్రభావం ఉండకపోవడంతో సరైన సమయానికే మ్యాచ్ ఆరంభమైంది. ప్రేక్షకులు కూడా పూర్తిగా ఎంజాయ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement