సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో పాల్గొనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువ ఆటగాళ్లుకు చోటు లభించింది. హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి (రూ. 20 లక్షలు), లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ (రూ. 10 లక్షలు), ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (రూ. 10 లక్షలు) ఈ సారి ఐపీఎల్ బరిలోకి దిగనున్నారు.
ఈ ముగ్గురిని కూడా హైదరాబాద్ ఫ్రాంచైజీనే వారి కనీసధరకు తీసుకుంది.ఆశిష్ రెడ్డి గత ఏడాది ఐపీఎల్‌లోనే సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా రాణించగా...భారత అండర్-19 జట్టు సభ్యులైన మిలింద్, భుయ్‌లకు ఇదే తొలి అవకాశం. ఇతర ఫ్రాంచైజీలు ఈ ఆటగాళ్లపై ఆసక్తి చూపించలేదు. అయితే గత సంవత్సరం రైజర్స్‌లో సభ్యుడిగా ఐపీఎల్‌తో పాటు చాంపియన్స్ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మన్ హనుమ విహారికి మాత్రం ఈ సారికి చాన్స్ దక్కలేదు. హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ అక్షత్ రెడ్డి, రవితేజ కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
గతంలో డెక్కన్ చార్జర్స్‌తో పాటు ముంబై, పుణే జట్లకు కూడా ఆడిన తిరుమలశెట్టి సుమన్‌కు కూడా నిరాశే ఎదురైంది. వీరితో పాటు రూ. 10 లక్షలనుంచి రూ. 30 లక్షల వరకు కనీస ధర పెట్టుకొని వేలంలో అదృష్టం పరీక్షించుకున్న హైదరాబాద్ ఆటగాళ్లు ఎవరినీ ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
మొత్తం 24 మంది ఆటగాళ్లతో రైజర్స్ జాబితా సిద్ధమైంది. జట్టుకు భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. ఈ జట్టులో 7 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా, 17 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్, 9 మంది బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
భారత దేశవాళీ క్రికెటర్లు
1. కరణ్ శర్మ (రైల్వేస్)
2. కేఎల్ రాహుల్ (కర్ణాటక)
3. పర్వేజ్ రసూల్ (కాశ్మీర్)
4. పరమేశ్వరన్ (కేరళ)
5. ఏజీ పౌనికర్ (రైల్వేస్)
6. అనిరుధ (తమిళనాడు)
7. జునేజా (గుజరాత్)
8. ఆశిష్ రెడ్డి (హైదరాబాద్)
9. మిలింద్ (హైదరాబాద్)
10. రికీ భుయ్ (ఆంధ్ర)
భారత ఆటగాళ్లు
1. శిఖర్ ధావన్
2. అమిత్ మిశ్రా
3. భువనేశ్వర్ కుమార్
4. ఇషాంత్ శర్మ
5. ఇర్ఫాన్ పఠాన్
6. వేణుగోపాలరావు
7. నమన్ ఓజా
విదేశీ ఆటగాళ్లు
1. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
2. వార్నర్ (ఆస్ట్రేలియా)
3. ఫించ్ (ఆస్ట్రేలియా)
4. స్యామీ (వెస్టిండీస్)
5. హెన్రిక్స్ (ఆస్ట్రేలియా)
6. హోల్డర్ (వెస్టిండీస్)
7. బ్రెండన్ టేలర్ (జింబాబ్వే)
ముగ్గురికే అవకాశం
Published Fri, Feb 14 2014 12:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement