రోహిత్ శర్మ మెరుపులు
అహ్మదాబాద్: మైఖల్ హసీ, సిమన్స్ అర్థ సెంచరీలు... రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 178 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ ముందు 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
మైఖల్ హసీ 39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. సిమన్స్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 19 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పొలార్డ్ 14 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు.