
డేర్ డెవిల్స్‌కు కొత్త లుక్
ఐపీఎల్-7లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొత్త లుక్‌తో బరిలోకి దిగనుంది. గత ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ జీఎంఆర్ ఇటీవల ఆటగాళ్లందరినీ కాదనుకుని మొత్తం కొత్తవాళ్లను తీసుకుంది. తాజాగా జీఎంఆర్ జట్టు పాత లోగోను కూడా వదిలించుకుంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొత్త లుక్‌తో బరిలోకి దిగనుంది. గత ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ జీఎంఆర్ ఇటీవల ఆటగాళ్లందరినీ కాదనుకుని మొత్తం కొత్తవాళ్లను తీసుకుంది. తాజాగా జీఎంఆర్ జట్టు పాత లోగోను కూడా వదిలించుకుంది.
ఈ నెల 16 నుంచి మొదలయ్యే ఏడో సీజన్‌లో ‘ఫ్లయింగ్ కైట్’ (ఎగిరే గాలిపటం) లోగోతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లోని 100 చోట్ల ఫ్లాష్ మాబ్‌లు నిర్వహించి, ఢిల్లీ డేర్ డెవిల్స్ లోగోను పోలిన పతంగులను ఎగురవేసి సందడి చేసింది. ఆకాశమే హద్దుగా లీగ్‌లో ఆటగాళ్లు చెలరేగిపోయేలా జట్టులో స్ఫూర్తి నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ చెప్పారు.