ఆన్‌లైన్‌లో 40 వేల ఐపీఎల్ టికెట్ల విక్రయం | IPL organisers sell 40,000 tickets online for UAE matches | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో 40 వేల ఐపీఎల్ టికెట్ల విక్రయం

Published Sun, Apr 6 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

IPL organisers sell 40,000 tickets online for UAE matches

అబుదాబీ: ఐపీఎల్-7 టికెట్ల విక్రయం జోరందుకుంది. ఇక్కడ జరిగే తొలి విడత మ్యాచ్‌ల కోసం ఆన్‌లైన్‌లో సుమారు 40 వేల టికెట్లు విక్రయించినట్లు లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు యూఏఈలోని మూడు వేదికల్లో తొలి విడత మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే.

 

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన టికెట్లకు అనూహ్య స్పందన లభించిందని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ రంజీబ్ బిస్వాల్ తెలిపారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఈస్ట్ మాట్లాడుతూ యూఏఈలో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని చెప్పారు. కేవలం మూడు రోజుల్లోనే ఇంతమొత్తంలో టికెట్లు అమ్ముడవడం గొప్ప విషయమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement