ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్: గంభీర్ డకౌట్ | Gautam Gambhir dock out in ipl-7 first match | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్: గంభీర్ డకౌట్

Published Wed, Apr 16 2014 8:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్: గంభీర్ డకౌట్

ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్: గంభీర్ డకౌట్

అబుదాబి: గౌతమ్ గంభీర్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫామ్ కోల్పోయి భారత క్రికెట్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన గౌతమ్ గంభీర్ ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్లో నిరాశ పరిచాడు. డకౌట్ అయి అభిమానులను అసంతృప్తికి గురి చేశాడు. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ దిగింది.

ఓపెనర్గా వచ్చిన గంభీర్ ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. 8 బంతులు ఎదుర్కొన్న గంభీర్ ఒక్క పరుగు చేయకుండానే మలింగ బౌలింగ్లో అవుటయ్యాడు. 1.4 ఓవర్లలో జట్టు స్కోరు 4 పరుగులు ఉన్నప్పుడు గంభీర్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. సీనియర్ ఆటగాడు జాక్వెస్ కల్లిస్, మనీష్ పాండే ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement