Goutam Gambhir
-
ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
టీమిండియా కొత్త కోచ్ నియామకం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ కాదని.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని బీసీసీఐకి సూచించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినా బీసీసీఐ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.అయితే, మెగా టోర్నీ తర్వాత మాత్రం ద్రవిడ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఇప్పటికే కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 27తో గడువు ముగిసింది.గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లే!కానీ ఇంతవరకు కొత్త కోచ్ ఎవరన్నా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. విదేశీ కోచ్‌ల వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చినా.. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో.. ఐపీఎల్-2024 చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా దాదాపు ఖరారైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.తెలివిగా వ్యవహరించాలి‘‘ఎవరి జీవితంలోనైనా కోచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మైదానం లోపల.. వెలుపలా.. ఒక వ్యక్తికి మార్గదర్శనం చేస్తూ వారిని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత. కాబట్టి కోచ్‌ని ఎంచుకునేటపుడు తెలివిగా వ్యవహరించాలి’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఎవరు పడితే వాళ్లను కోచ్‌లుగా నియమించొద్దని పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు.ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘గంభీర్‌కు వ్యతిరేకంగానే మీరు ఈ పోస్ట్ పెట్టారు కదా? ఆయన హెడ్‌కోచ్ అవటం మీకు ఇష్టం లేదా?’’ అంటూ గంగూలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, దాదా అభిమానులు మాత్రం.. ‘‘గ్రెగ్ చాపెల్ మాదిరి ఇంకో కోచ్ వస్తే ఆటగాళ్లను విభజించి జట్టును భిన్న వర్గాలుగా విడదీస్తాడనే భయంతోనే గంగూలీ ఇలా జాగ్రత్తలు చెబుతున్నారు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుThe coach's significance in one's life, their guidance, and relentless training shape the future of any person, both on and off the field. So choose the coach and institution wisely…— Sourav Ganguly (@SGanguly99) May 30, 2024 -
వీళ్ళ క్రియేటివిటీ మాములుగా లేదుగా వైరల్ అవుతున్న వీడియో..
-
మళ్ళీ కోహ్లీని కెలుకుతున్న గంభీర్, నవీన్.. BCCIకి లేఖ రాసిన కోహ్లీ
-
అతను రియల్ బాస్..గంభీర్ ని మళ్ళీ రెచ్చగొట్టిన కోహ్లీ
-
కెలికింది సిరాజ్... బ్యాడ్ అయింది కోహ్లీ
-
కోహ్లీ, గంభీర్ గొడవ గురించి ప్రత్యక్ష సాక్షి మాటల్లో...
-
కోహ్లీ, గంభీర్‌కి బిగ్ షాక్.. నవీన్‌కి కూడా దెబ్బ పడింది
-
'జడేజా, చాహల్‌కు నో ఛాన్స్.. వరల్డ్ కప్‌కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్'
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్.. 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున బరిలోకి దిగే నలుగురు స్పిన్నర్లరను ఎంచుకున్నాడు. కాగా ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గంభీర్ స్టార్ స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌లో మణికట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు కచ్చితంగా చోటు ఇవ్వాలి. అక్షర్ గత కొన్ని సిరీస్‌ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండాలి. ఇక కుల్దీప్ యాదవ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారత్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేయగలడు. కాబట్టి కుల్దీప్ కూడా ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇక ఆఖరిగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రవి ప్రస్తుతం భారత్ సన్నాహాకాల్లో లేనప్పటికీ.. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్‌కు గంభీర్ ఎంపిక చేయకపోవడం గమానార్హం. చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
డబుల్ సెంచరీ చేశాక ఈ చర్చలు ఎందుకు? భారత ఓపెనర్‌గా అతడే సరైనోడు..!
వన్డే ఫార్మాట్లో టీమిండియా ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్‌గా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఉండాలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ జోడిగా కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని గంభీర్ సూచించాడు. ఇక కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కిషన్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తన తొలి అంతర్జాతీయ సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన ఏకైక ఆటగాడిగా ఈ జార్ఖండ్ డైన్‌మెట్ చరిత్ర సృష్టించాడు. కాగా కిషన్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అతడి అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చేప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో గంభీర్ మాట్లాడుతూ.. "ఇషాన్ ఇటీవలే బంగ్లాదేశ్‌పై అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. అయినప్పటికీ వన్డేల్లో భారత రెగ్యూలర్ ఓపెనర్ ఎవరన్న విషయం గురించి చర్చలు జరగుతుండడం నాకు ఆశ్చర్యంగా ఉంది. బంగ్లాతో వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డా.. కిషన్ మాత్రం ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు. అతడు భారత ఇన్నింగ్స్ 35వ ఓవర్ ముగిసే సరికి డబుల్ సెంచరీ మార్క్‌ను సాధించాడు. అతడికి దీర్ఘ కాలం రాణించే సత్తా ఉంది. అదే విధంగా వికెట్ కీపర్‌గా కూడా కిషన్ సేవలు అందించగలడు. నా వరకైతే టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి చర్చ ముగిసింది అని అనుకుంటున్నాను. వన్డేల్లో రోహిత్ జోడిగా ఇషాన్ కిషన్ బరిలోకి దిగాలి. అదే విధంగా విరాట్ కోహ్లి మూడు, సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావాలి. ఇక కీలకమైన ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉండాలి. ఫినిషర్‌గా హార్దిక్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి" అని అతడు పేర్కొన్నాడు. కాగా గంభీర్ పేర్కొన్న ఆరుగురి ఆటగాళ్లలో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరు లేకపోవడం గమనార్హం. కాగా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌కు భారత జట్టులో కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఇక స్వదేశంలో భారత జట్టు శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడేందకు సిద్దమవుతోంది. ముంబై వేదికగా భారత్-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో హార్దిక్ పాండ్యా భారత సారథిగా వ్యవహరించనున్నాడు. చదవండి: Umran Malik: నా ధ్యాస మొత్తం దాని మీదే! అక్తర్ రికార్డు బద్దలు కొడతా! అయితే.. -
'టీ20 ప్రపంచకప్ భారత జట్టులో అతడు ఖచ్చితంగా ఉండాలి'
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్ ఖచ్చితంగా ఉండాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో కిషన్ బ్యాక్‌ఫుట్ షాట్లు ఆద్భుతంగా ఆడగలడని గంభీర్ తెలిపాడు."కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చినా ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలి. రోహిత్.. కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించి, రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. ఎందుకుంటే ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై కిషన్ ఆద్భుతంగా ఆడగలడు. కాబట్టి టీ20 ప్రపంచకప్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో కిషన్ ఖచ్చితంగా ఉండాలి. అతడు రన్స్ చేసిన చేయకపోయినా జట్టులో సానుకూల దృక్పథం తీసుకు వస్తాడు "అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భారత జట్టులో కిషన్ భాగంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన కిషన్ 110 పరుగులు సాధించాడు. చదవండి: ICC World Cup Super League: రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులు.. అక్కడ క్లీన్‌స్వీప్ చేసి.. ఇక్కడ వైట్‌వాష్‌కు గురై! -
హాట్సాఫ్ కోహ్లి: గంభీర్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ‘ఏ విషయంలోనైనా సరే.. మనం ఏం చేయాలని కోరుకుంటామో అదే చేస్తాం. నిజానికి, చివరి రన్ పూర్తి చేసి హోటల్ గదికి వచ్చిన తర్వాత.. దేశం కోసం నేను ఈమాత్రం చేయగలిగాను అనే సంతృప్తి లభిస్తుంది చూడండి.. నాకు తెలిసి అదే ప్రపంచంలో అన్నింటికంటే మనకు ఎక్కువ సంతోషాన్ని కలిగించే అనుభూతి. ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ఈరోజు తను ఈ స్థాయిలో ఉన్నాడు. అతడికి హ్యాట్సాఫ్. 20 వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అందులో సెంచరీలు, అర్ధ సెంచరీలు ఎన్నో ఉన్నాయి’’ అంటూ మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. కాగా భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయినప్పటికీ వ్యక్తిగతంగా కోహ్లి అరుదైన రికార్డులు నెలకొల్పాడు. నవంబరు 29న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో వన్డేలో 22 వేల పరుగుల(ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి) మార్కుకు చేరుకున్న ఈ రన్‌మెషీన్.. గత దశాబ్ద కాలంగా 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. (చదవండి: ఏంటిది కోహ్లి.. ఇలా ముగించేశావు? ) అదే విధంగా బుధవారం నాటి చివరి మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలుగొట్టాడు. దీంతో మాజీ క్రికెటర్లు కోహ్లి బ్యాటింగ్ తీరు, అతడి అంకిత భావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో గౌతీ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ విరాట్ కోహ్లి ప్రదర్శనపై పైవిధంగా స్పందించాడు. (చదవండి: 'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా') 22,000 international runs for Virat Kohli 🤯 Describe this cricketer in one word 👇 pic.twitter.com/wPH6ELCUmV — ICC (@ICC) November 29, 2020 -
'కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు'
ముంబై : కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని యాజమాన్యాన్ని కోరినా.. అది జరగలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ యూట్యూబ్ చానెల్‌తో జరిగిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2009లో తనని కేకేఆర్ కెప్టెన్‌గా తొలగించడానికి గల కారణాలను కూడా గుర్తుచేసుకున్నాడు. 'గౌతమ్ గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం చూశా. అతను కోల్‌కతాకు కెప్టెన్ అయ్యాక షారుఖ్ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఇది నీ జట్టు, నేను మధ్యలో కలగజేసుకోనని షారుఖ్ చెప్పాడని గౌతీ తెలిపాడు. ఇదే విషయాన్ని నేను ఐపీఎల్ తొలి సీజన్లోనే షారుఖ్‌ను అడిగాను. కానీ అది జరగలేదు. అదే సమయంలో మిగతా ఐపీఎల్ ఫ్రాంఛైజీల యాజమాన్యాలు వారి ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాయి. ఉదాహరణకు చెన్నైనే తీసుకోండి. ఎంఎస్ ధోనీ ఎలా నడిపిస్తున్నాడో మనకు తెలుసు. అలాగే ముంబైలోనూ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. రోహిత్, ధోనీలకు స్వేచ్ఛ ఉంది కాబట్టే సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. అప్పుడు నన్ను కెప్టెన్‌గా తొలగించడానికి కోచ్ జాన్ బుచనన్ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని, అది నా వల్ల మాత్రం కాదు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమే' అని గంగూలీ తెలిపాడు.(దటీజ్ దాదా.. ఆసియాకప్ వాయిదా) 2008 ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభ సమయంలో సౌరవ్ గంగూలీ ఒక స్టార్ ఆటగాడిగా ఉన్నాడు. షారుక్ ఖాన్ ఆధ్వర్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో పెద్ద ఆశ్చర్యం కలిగిగించలేదు.. ఎందుకంటే అప్పటికే టీమిండియా జట్టును విజయవంతంగా నడిపిన సారధిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత్ క్రికెట్లో దూకుడైన ఆటతీరుతో పాటు కెప్టెన్‌గా సాహోసోపేత నిర్ణయాలు తీసుకున్న గంగూలీ భారత అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి గంగూలీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో దాదా అని ముద్దుగా పిలుచుకునేవారు. భారత జట్టును విజయవంతంగా నడిపిన దాదా కేకేఆర్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ సాధించిపెడతాడని అభిమానులు భావించారు. కానీ అలా జరగలేదు.. మొదటి సీజన్లో మొదటి మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లు విఫలమవడంతో లీగ్‌లో 6వ స్థానంలో నిలిచింది. తర్వాతి సీజన్లో జట్టుకు కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ కోచ్ జాన్ బుచానన్ మల్టిపల్ కెప్టెన్సీ అనే ప్రతిపాదన తీసుకురావడం, గంగూలీ కెప్టెన్‌గా విఫలమయ్యాడంటూ బ్రెండన్ మెకల్లమ్‌కు బాధ్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ ఏడాది కేకేఆర్ ప్రదర్శన మరింత దిగజారింది. లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచి చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో మూడో సీజన్‌కు మళ్లీ గంగూలీనే కెప్టెన్‌గా ఎంపిక చేసిన కేకేఆర్ రాత మాత్రం మారలేదు. మూడో సీజన్లో కేకేఆర్ 6వ స్థానంలో నిలిచింది. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీ గంగూలీ స్థానంలో గౌతం గంభీర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో కోల్‌కతా దశ తిరిగింది. గంభీర్ సారధ్యంలో రెండు సార్లు టైటిల్ గెలవడంతో పాటు నాలుగుసార్లు ఫ్లే ఆఫ్ దశకు చేరింది.(చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ) -
బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (37) రాజకీయాల్లోకి ప్రవేశించారు. శుక్రవారం కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ల సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరుతున్నానని, పార్టీ సభ్యుడిగా దేశ సంక్షేమం కోసం కృషి చేస్తానని గంభీర్ తెలిపారు. దేశానికి మంచి చేయడానికి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఇది మంచి వేదిక అని వెల్లడించారు. అనంతరం గంభీర్ బీజేపీ పార్టీ అధినేత అమిత్ షాను కలుసుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన గంభీర్ బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ కేడర్ విస్తరించిందని, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. గంభీర్, 2011 ప్రపంచ కప్, 2007 టీ–20 ప్రపంచ కప్‌లను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకుగాను బిహార్‌లో మహాకూటమి సీట్ల పంపిణీ ఖరారైంది. ఇందులోభాగంగా లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) అధ్యక్షుడు శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గుర్తుపై పోటీ చేయనున్నారు. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను 20 చోట్ల లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. మహా కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఉపేంద్ర కుష్వాహాకు చెందిన లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) 5, ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 3 స్థానాల్లో పోటీ చేస్తాయి. మాజీ సీఎం జితేన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్తా ఆవాల్ మోర్చా(హెచ్ఏఎం) మూడు చోట్ల నుంచి బరిలోకి దిగనుంది. ఆర్జేడీ తనకు దక్కిన 20 చోట్లలో ఒక సీటును సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. అదేవిధంగా, 11 సీట్లు ఇవ్వాలంటూ మొదట్నుంచీ పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చే ఒప్పందంపై 9 స్థానాలకు దిగివచ్చింది. ఆర్ఎల్ఎస్పీకి మహాకూటమిలో చేరడంతో 5 సీట్లు దక్కాయి. బీఎస్పీ తొలి జాబితా లక్నో: బీఎస్పీ 11 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో జేడీఎస్ మాజీ నేత డేనిష్ అలీ పేరు ఉంది. జేడీఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలీ గత వారమే బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకుగాను ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ కూటమిలో బీఎస్పీ 38 చోట్ల, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కుటుంబంతో వచ్చి నామినేషన్ వేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న ట్రాన్‌జెండర్ భారతి కన్నమ్మ -
ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్‌గా గంభీర్
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2018 సీజన్‌కు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గంభీర్ కెప్టెన్సీపై నమ్మకం ఉంచడంతో ఈ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాళ్లకు సరైన సారథి గంభీరేనని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సారథిగా అతను ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వలేదని, గత సీజన్లో గంభీర్ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. యువ ఆటగాళ్లకు అనుభవం ఉన్న కెప్టెన్ కావాలని కోరుకున్నామని, గంభీరే సరైన సారథి అని భావించి నిర్ణయం తీసుకున్నామన్నారు. గంభీర్ సారథ్యంలోనే ఢిల్లీ టైటిల్ గెలుస్తోందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక 2011లో కేకేఆర్ పగ్గాలు చేపట్టిన గంభీర్ అటు సారథిగా ఇటు బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించాడు. కొన్ని సీజన్లలో టాప్ స్కోరర్‌గా సైతం నిలిచాడు. గంభీర్ సారథ్యంలోనే కేకేఆర్ రెండు సార్లు (2012, 2014 సీజన్లలో) టైటిల్ కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్‌ను ఈ సీజన్లో కేకేఆర్ వదులు కోవడంతో ఫ్రాంచైజీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ టౌన్‌కు ఆడాలనే తన కోరిక మేరకే వదులుకున్నామని కేకేఆర్ ఆ తర్వతా స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ రూ.2.80 కోట్లకు గంభీర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గంభీర్ సొంత గూటికి చేరినట్లైంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో గంభీర్ ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు. -
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్... కోల్‌కతా విన్
న్యూఢిల్లీ: గౌతమ్ గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-7లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో బుధవారం ఫిరోజ్ షా కోట్లా మైదానం జరిగిన మ్యాచ్‌లో గంభీర్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లో ఛేదించింది. గంభీర్ అర్థ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. రాబిన్ ఊతప్ప 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేశారు. మనీష్ పాండే 23 పరుగులు సాధించాడు. ఢిల్లీ బౌలర్లలో పార్నెల్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. డుమిని 40, దినేష్ కార్తీక్ 36, జాదవ్ 26, మురళీ విజయ్ 24 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో కల్లిస్, యాదవ్, షకీబ్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. గంభీర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్: గంభీర్ డకౌట్
అబుదాబి: గౌతమ్ గంభీర్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫామ్ కోల్పోయి భారత క్రికెట్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన గౌతమ్ గంభీర్ ఐపీఎల్-7 ఆరంభ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. డకౌట్ అయి అభిమానులను అసంతృప్తికి గురి చేశాడు. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ దిగింది. ఓపెనర్‌గా వచ్చిన గంభీర్ ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. 8 బంతులు ఎదుర్కొన్న గంభీర్ ఒక్క పరుగు చేయకుండానే మలింగ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 1.4 ఓవర్లలో జట్టు స్కోరు 4 పరుగులు ఉన్నప్పుడు గంభీర్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సీనియర్ ఆటగాడు జాక్వెస్ కల్లిస్, మనీష్ పాండే ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పట్టాలెక్కించే పనిలో పడ్డారు.