గౌతమ్ గంభీర్
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2018 సీజన్‌కు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గంభీర్ కెప్టెన్సీపై నమ్మకం ఉంచడంతో ఈ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాళ్లకు సరైన సారథి గంభీరేనని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సారథిగా అతను ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వలేదని, గత సీజన్‌లో గంభీర్ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. యువ ఆటగాళ్లకు అనుభవం ఉన్న కెప్టెన్ కావాలని కోరుకున్నామని, గంభీరే సరైన సారథి అని భావించి నిర్ణయం తీసుకున్నామన్నారు. గంభీర్ సారథ్యంలోనే ఢిల్లీ టైటిల్ గెలుస్తోందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక 2011లో కేకేఆర్ పగ్గాలు చేపట్టిన గంభీర్ అటు సారథిగా ఇటు బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించాడు. కొన్ని సీజన్‌లలో టాప్ స్కోరర్‌గా సైతం నిలిచాడు. గంభీర్ సారథ్యంలోనే కేకేఆర్ రెండు సార్లు (2012, 2014 సీజన్‌లలో) టైటిల్ కైవసం చేసుకుంది.
కెప్టెన్‌గా రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్‌ను ఈ సీజన్‌లో కేకేఆర్ వదులు కోవడంతో ఫ్రాంచైజీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ టౌన్‌కు ఆడాలనే తన కోరిక మేరకే వదులుకున్నామని కేకేఆర్ ఆ తర్వతా స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ రూ.2.80 కోట్లకు గంభీర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గంభీర్ సొంత గూటికి చేరినట్లైంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లలో గంభీర్ ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment