
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్ ఖచ్చితంగా ఉండాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో కిషన్ బ్యాక్‌ఫుట్ షాట్‌లు ఆద్భుతంగా ఆడగలడని గంభీర్ తెలిపాడు."కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చినా ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలి.
రోహిత్.. కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించి, రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. ఎందుకుంటే ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై కిషన్ ఆద్భుతంగా ఆడగలడు. కాబట్టి టీ20 ప్రపంచకప్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో కిషన్ ఖచ్చితంగా ఉండాలి. అతడు రన్స్ చేసిన చేయకపోయినా జట్టులో సానుకూల దృక్పథం తీసుకు వస్తాడు "అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భారత జట్టులో కిషన్ భాగంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన కిషన్ 110 పరుగులు సాధించాడు.
చదవండి: ICC World Cup Super League: రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులు.. అక్కడ క్లీన్‌స్వీప్ చేసి.. ఇక్కడ వైట్‌వాష్‌కు గురై!