టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీహార్‌కు చెందిన ప్రణవ్ స్థానిక అధికార పార్టీ అయిన జనతాదల్ యునైటెడ్‌లో (జేడీయూ) చేరారు. జేడీయూ చీఫ్‌గా నితీశ్‌కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చున్నూగానూ పిలువబడే ప్రణవ్‌ను జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా పార్టీలోకి ఆహ్వానించారు.
పట్నాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రణవ్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ప్రణవ్ పాండేకు ఇషాన్ కిషన్ తండ్రిగానే కాకుండా స్థానికంగా ప్రముఖ బిల్డర్‌గా మంచి పేరుంది. బిల్డర్‌గా ఉంటూనే ప్రణవ్ మెడికల్ స్టోర్ వ్యాపారంలోనూ ఉన్నారు. జేడీయూలో చేరిక సందర్భంగా ప్రణవ్ ఇలా అన్నారు. పార్టీ కోసం నమ్మకమైన సైనికుడిగా పని చేస్తానని తెలిపాడు. ఇదే సందర్భంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ.. సీఎం నితీశ్‌కుమార్ చేస్తున్న అభివృద్దిని చూసి ప్రణవ్ పార్టీలో చేరారన్నారు. ప్రణవ్ చేరిక మగద్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తుందని తెలిపారు.
కాగా, ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇషాన్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీల్లో ఇషాన్ పరుగుల వరద పారించాడు. తిరిగి జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా ఇషాన్ ముందుకు కదులుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment